Happy Birthday Sanju Samson: టీమిండియా యువ ఆ టగాడు సంజు శాంసన్ పుట్టినరోజు నేడు. 1994 నవంబర్ 11న జన్మించిన అతడు నేడు 30వ వడిలోకి అడుగుపెడుతున్నాడు. కేరళలో జన్మించిన అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇటీవల సీజన్లో ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. కప్ సాధించకపోయినప్పటికీ ఆ జట్టు సానుకూల దృక్పథంతో అటు తీరును కొనసాగించింది. 2015లో జింబాబ్వే సిరీస్ ద్వారా అతడు జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. టి20 క్రికెట్లో సెంచరీ చేసిన తొలి భారతీయ వికెట్ కీపర్ గా రికార్డ్ సృష్టించాడు. టి20 క్రికెట్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారతీయ క్రికెటర్ గా చరిత్ర పుటల్లో నిలిచాడు. అతని ఆట తీరు అద్భుతంగా ఉండడంతో ఎబి డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు అతడిని మూడు ఫార్మాట్ లలో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ కు సూచించారు. 2015లోనే జాతీయ జట్టులోకి ప్రవేశించినప్పటికీ సంజు శాంసన్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. ఒక దశలో అతడు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోవడంతో జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ఇటీవలి బంగ్లాదేశ్ సిరీస్ అతడి ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన చివరి t20 మ్యాచ్లో సంజు సెంచరీ చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో శతకం బాదాడు. ఇలా వరుసగా రెండు మ్యాచ్లలో సెంచరీలు చేసిన తొలి భారతీయ వికెట్ కీపర్ గా సంజు రికార్డు సృష్టించాడు. ఇక రెండవ టి20లో అతడు 0 పరుగులకు ఔట్ కావడంతో.. అది టీమిండియా విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపించింది. నేడు 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంజుకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఉత్తమ ఇన్నింగ్స్ ఇవే
సంజు ఇటీవల దక్షిణాఫ్రికా తో చేసిన సెంచరీ సంచలనంగా మారింది. అతడు ఏకంగా 10 సిక్స్ లు కొట్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 202 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై 61 పరుగుల తేడాతో గెలిచింది.
2021 ఐపీఎల్ లో పంజాబ్ పై సంజు దూకుడు కొనసాగించా. 63 బంతుల్లోనే 119 రన్స్ చేసి అదరగొట్టాడు. బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ పంజాబ్ జట్టు స్వల్ప పరుగుల తేడాతో గెలిచింది.
ఐపీఎల్ 2019లో హైదరాబాద్ జట్టు పై సంజు అజేయ సెంచరీ చేశాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. హైదరాబాద్ జట్టు విజయం సాధించడం విశేషం.
2017 ఐపీఎల్ లో పూణే పై సంజు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 63 బాల్స్ ఎదుర్కొని 102 రన్స్ సాధించాడు. ఢిల్లీ జట్టు తరఫున ఆడిన సంజు.. ఐపీఎల్ లో తన తొలి సెంచరీ చేశాడు. అతని బ్యాటింగ్ దూకుడు వల్ల ఢిల్లీ జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2020 ఐపిఎల్ లో షార్జా వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజు 42 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. సంజు సూపర్ బ్యాటింగ్ ద్వారా.. పంజాబ్ జట్టు విధించిన 223 పరుగుల విజయ లక్ష్యం సులువుగానే కరిగిపోయింది
2018 ఐపీఎల్ లో బెంగళూరు జట్టుపై సంజు 45 బంతుల్లోనే 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు చేదించలేకపోయింది.
ఇటీవల బంగ్లాదేశ్ జట్టుపై సంజు 111 పరుగులు చేశాడు. హైదరాబాదులోని ఉప్పల్ మైదానంలో ఈ టి20 మ్యాచ్ జరిగింది. కొన్ని సంవత్సరాలుగా జట్టుకు దూరమైన సంజు.. ఈ సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.
2023లో పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో సంజు 114 బంతుల్లో 108 పరుగులు చేశారు.. తద్వారా టీమిండియా 296/8 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గత ఏడాది ట్రీని డాడ్ టొబాగో వేదికగా వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్లో సంజు 41 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఈ వన్డే మ్యాచ్లో భారత్ 351/5 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆతిధ్య వెస్టిండీస్ జట్టును 151 పరుగులకే కుప్ప కూల్చింది. 200 పరుగుల తేడాతో విజయం సాధించింది..