https://oktelugu.com/

TNPL: ఒక్క బాల్ కు 18 రన్స్ .. క్రికెట్ లో రికార్డ్.. ఎలా సాధ్యమైందంటే?

ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొడితే 36 పరుగులు వస్తాయి. అయితే, ఇప్పటి వరకు ఈ ఘనతను అతి కొద్దిమంది మాత్రమే అందుకున్నారు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ ఉండగా

Written By:
  • BS
  • , Updated On : June 14, 2023 / 01:57 PM IST

    TNPL

    Follow us on

    TNPL: క్రికెట్ లో ఒకే ఓవర్ లో 36 పరుగులు కొట్టడం అతి కష్టం మీద సాధ్యపడుతుంది. ఒక బంతికి అత్యధికంగా ఆరు పరుగులు మాత్రమే వస్తాయి. బౌలర్ దరిద్రం మరీ ఎక్కువగా ఉంటే వైడ్లు, నో బాల్స్ వేసినా బంతికి ఎనిమిది పరుగులకు మించి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఈ అంచనాలను, లెక్కలను తలకిందులు చేస్తూ ఒక బౌలర్ ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. అది కూడా భారత్ లోని తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఒక లీగ్ లో కావడం గమనార్హం.

    ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొడితే 36 పరుగులు వస్తాయి. అయితే, ఇప్పటి వరకు ఈ ఘనతను అతి కొద్దిమంది మాత్రమే అందుకున్నారు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ ఉండగా, తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన జాబితాలో పలువురు క్రికెటర్లు ఉన్నారు. 12 బంతుల్లో 50 పరుగులు చేసిన జాబితాలో యువరాజ్ సింగ్ తోపాటు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ హాజరతుల్లా జజాయ్ కూడా ఉన్నాడు. 12 బంతుల్లో 50కిపైగా పరుగులు చేశారు. అంటే ఒక్కో బంతికి నాలుగు పరుగులు చొప్పున చేసినట్లు. ఒక బంతికి నాలుగు పరుగులు చేయడం అంటే చాలా వరకు అసాధ్యం. ప్రతి బంతిని ఫోర్, సిక్స్ కొట్టాల్సి ఉంటుంది. మరీ, బౌలర్ పరిస్థితి అధ్వానంగా ఉంటేనో, బ్యాటర్ భీకరమైన ఫామ్ లో ఉంటేనో తప్ప ఇది సాధ్యం కాదు. బంతికి నాలుగు పరుగులు కొట్టడమే అసాధ్యం అనుకుంటున్న తరుణంలో ఏకంగా ఒక బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు ఒక బౌలర్. అది కూడా ఇండియాలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

    తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో సమర్పించుకున్న బౌలర్..

    ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో భాగంగా సలెమ్ స్పార్టెన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక బౌలర్ దారుణమైన ప్రదర్శనతో ఈ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. సలేమ్ స్పార్టెన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజులో ఉన్న సంజయ్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫైనల్ ఓవర్ లో మొదటి నాలుగు బంతులు అద్భుతంగా బౌలింగ్ చేసిన అభిషేక్ ఆరు పరుగులు మాత్రమే సమర్పించాడు. తర్వాత బంతిని నోబాల్ వేసి ఒక పరుగు ఇచ్చుకున్నాడు. దీంతో ఐదు బంతుల్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చినట్టు అయింది. చివర బంతిని బౌలింగ్ చేసి సిక్స్ ఇచ్చిన ఓవరాల్ గా 14 పరుగులు ఇచ్చినట్లు అయ్యేది. కానీ, ఇక్కడే బౌలర్ పూర్తిగా తేలిపోయాడు. చివరి బంతి వేయడానికి బౌలర్ ఆపసోపాలు పడ్డాడు. దీంతో ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

    ఒకే బంతికి 18 పరుగులు.. తెల్ల మొహం వేసిన బౌలర్..

    చివర బంతి కోసం బౌలర్ అభిషేక్ నానాపాట్లు పడ్డాడు. మూడు నో బాల్స్, ఒక వైడ్ బాల్ సహా మొత్తంగా 5 బంతులు వేసి బౌలింగ్ పూర్తి చేశాడు. అయితే, మొదటి నో బాల్ కు ఒక పరుగు మాత్రమే వచ్చింది, రెండో నో బాల్ కు ఆరు పరుగులు రాగా, నో బాల్ రన్ ఒకటి కలిసి వచ్చింది. మూడో నో బాల్ కు రెండు పరుగులు, ఒక నో బాల్ పరుగు వచ్చింది. నాలుగో బంతిని వైడ్ బాల్ వేయడంతో మరో పరుగు కలిసి వచ్చింది. చివరి బంతిని కరెక్ట్ గా వేసినప్పటికీ క్రీజులో ఉన్న బ్యాటర్ సిక్స్ గా మలచడంతో ఆరు పరుగులు వచ్చాయి. మొత్తంగా చివరి బంతికి 18 పరుగులు రాగా, ముందు ఐదు బంతుల్లో ఇచ్చిన ఎనిమిది పరుగులతో కలిపి ఫైనల్ ఓవర్ లో 26 పరుగులను అభిషేక్ తన్వర్ సమర్పించుకున్నాడు. టి20 చరిత్రలోనే ఇటువంటి రికార్డు ఇప్పటి వరకు నమోదు కాలేదు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ ఓవర్ వేసి ఈ రికార్డును తన పేరిట అభిషేక్ తన్వర్ లిఖించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే చెపాక్ సూపర్ గల్లీస్ 52 పరుగులు తేడాతో సలీమ్ స్పార్టెన్స్ మీద విజయం సాధించింది.