Pakistan Vs India: ఒళ్ళు బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొడితే ఎలా ఉంటుంది.. ఇది పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ కు అనుభవంలోకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అతనికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ నిద్రలేని రాత్రిని పరిచయం చేశాడు.. ఫైనల్ మ్యాచ్లో ఒకానొక దశలో ఓటమి అంచులో ఉన్న టీం ఇండియాను కాపాడడం మాత్రమే కాదు.. రౌఫ్ బౌలింగ్ ను ఊచ కోత కోశాడు తిలక్ వర్మ.
ఇటీవల సూపర్ 4 మ్యాచ్ జరిగినప్పుడు రౌఫ్ భారత ఆటగాళ్ల మీదికి అనవసరంగా వెళ్లిపోయాడు. బీభత్సంగా పరుగులు తీస్తుంటే.. సరిగ్గా బౌలింగ్ వేయడం చేతకాక దూషణ పర్వానికి దిగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు అతనికి గట్టిగానే సమాధానం చెప్పారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, గిల్ అయితే అతని బౌలింగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇక అప్పటినుంచి అతడిని ఒక కంట కనిపెట్టుకొని ఉంటున్న.. టీం ఇండియా ప్లేయర్లు.. మొత్తానికి గట్టిగానే ఇచ్చి పడేశారు. ఫైనల్ మ్యాచ్లో పిచ్చ కొట్టుడు కొట్టి ఇంకోసారి.. తమ జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ గట్టిగా హెచ్చరిక పంపారు. దీంతో ఈ జన్మలో ఇక రౌఫ్ టీమిండియా జోలికి రాడు. రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడడు.
ముఖ్యంగా చివరి ఓవర్ లో రౌఫ్ బౌలింగ్లో తిలక్ వర్మ సిక్సర్ కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. అదే ఊపులో బౌండరీ కూడా సాధించి రౌఫ్ దిమ్మతిరిగేలా చేశాడు. ఫైనల్ మ్యాచ్లో 3.4 ఓవర్లు వేసిన రౌఫ్ ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. 50 పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ.. రౌఫ్ మాత్రం తేలిపోయాడు. వాస్తవానికి టీం ఇండియా బ్యాటర్లు రౌఫ్ బౌలింగ్లో అత్యంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. అతడిని లక్ష్యంగా చేసుకొని పరుగులు పిండుకున్నారు. ఇప్పటికైనా రౌఫ్ బుద్ధి తెచ్చుకోవాలని.. జెంటిల్మెన్ గేమ్ లో చిల్లర వేషాలు వేయకూడదని టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.