spot_img
Homeక్రీడలుIndia Vs Pakistan Asia Cup 2023: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో కీలకంగా మారనున్న...

India Vs Pakistan Asia Cup 2023: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో కీలకంగా మారనున్న ఆ ముగ్గురు ప్లేయర్లు…

India Vs Pakistan Asia Cup 2023: ఇండియా క్రికెట్ మ్యాచ్ ఏ దేశం మీద ఆడిన కూడా కొంతమంది మాత్రమే మ్యాచ్ చూస్తారు, కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడితే దేశం లో చాలా ఎక్కువ మంది ఈ మ్యాచ్ ని చూడటానికి ఉత్సాహాన్ని చూపిస్తారు…దేశం అనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.ఇక అందులో భాగంగానే ఏషియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ కి ఇండియా కి మ్యాచ్ కూడా జరగబోతుంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ వర్షం కారణం గా రద్దవ్వడం తో ఇప్పుడు జరిగే మ్యాచ్ మీదే అందరి చూపు ఉంది…ఇక ఇది ఇలా ఉంటె పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు అందరు కూడా ఇండియా టీం ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు మొన్న వర్షం వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతె ఇండియా టీం మా చేతిలో చిత్తూ గా ఓడిపోయేది అంటూకామెంట్లు చేస్తున్నారు. ఇక వీటితో పాటు గా ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కి కూడా వర్షం రావాలని కోరుకోండి లేకపోతే మా టీం ఇండియా ని చిత్తూ గా ఓడిస్తుంది అంటూ వ్యంగ్యం గా కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయం లోకి వస్తే ఇండియా పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 10 వ తేదీన ఒక భారీ మ్యాచ్ అయితే జరగనుంది…నిజానికి ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం మనకు తెలిసిందే…ఇప్పుడు జరిగే మ్యాచ్ లో ఏ టీం కి ఎక్కువ గా గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పటికే చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.అయితే ఈ రెండు టీంలు గతంలో ఎన్నిసార్లు తలపడ్డాయి అనే విషయాలను ఒకసారి మనం తెలుసుకుందాం…

రీసెంట్ గా ఆడిన మ్యాచ్ తో కలిపి ఇప్పటివరకు ఇండియా పాకిస్థాన్ రెండు టీంలు 133 సార్లు తలపడితే అందులో ఇండియా 55 సార్లు విజయం సాధించగా,ఇండియా 73 సార్లు విజయం సాధించింది.రిజల్ట్ తేలని మ్యాచులు ఐదు ఉన్నాయి…ఇక ఏషియా కప్ లో ఈ రెండు టీములు కూడా ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడగా అందులో ఇండియా ఏడూ మ్యాచులు గెలిస్తే పాకిస్థాన్ మాత్రం ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది.ఇక పాకిస్థాన్ టీం ప్లేయర్ల విషయానికి వస్తే వీళ్లు అందరూ కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు.ఇక వీళ్లే కాకుండా బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్లు అయినా షాహిన్ ఆఫ్రిది,నసీం షా,హారిస్ రాఫ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు కూడా పాకిస్థాన్ టీం లో చాలా కీలక పాత్ర పోషించ బోతున్నారు…ఇక అలాగే మన టీం విషయానికి వస్తే మనవాళ్ళు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు కానీ మనవాళ్ళు ఏ మ్యాచ్ కి ఎలా ఆడుతున్నారు అనే విషయం మీద అసలు క్లారిటీ ఉండటం లేదనే చెప్పాలి…

ఇక ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య మంచి పోటీ నెలకొననుంది అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తుంది.పాకిస్థాన్ ప్లేయర్లలో ఫకర్ జమాన్,ఇమామ్ ఉల్ హాక్, బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ లాంటి ప్లేయర్లతో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.వీళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం వాళ్ళు మన బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం…ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఆ ముగ్గురు పేస్ బౌలర్లతో పాటు షాదాబ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ లో కీలకం గా మారనున్నాడు. ఇక ఇండియన్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే అందరు మంచి ఫామ్ లో ఉన్న కూడా మొన్న జరిగిన మ్యాచ్ లో అందరు చేతులు ఎత్తేసారు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య ఇద్దరు మాత్రమే మంచి స్కోర్ చేసి మన ఇండియా పరువు కాపాడారు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు జరిగే మ్యాచ్ లో కొంచం జాగ్రత్త గా ఆడితే మంచిది.ముఖ్యంగా పాకిస్థాన్ టీం కి చెందిన షాదాబ్ ఖాన్ కి, హార్దిక్ పాండ్య కి మధ్య ఈ మ్యాచ్ లో మంచి పోటీ అయితే ఉండనుంది.ఇంతకు ముందు పాకిస్థాన్ మీద జరిగిన అన్ని మ్యాచుల్లో హార్దిక్ పాండ్య కి మంచి రికార్డు అయితే ఉంది. ఇక మొన్న జరిగిన మ్యాచ్ లో కూడా 87 రన్స్ చేసి టీం ని ఆదుకున్నాడు. అందుకే హార్దిక్ పాండ్య పాకిస్థాన్ మీద ఎప్పుడు మ్యాచ్ ఆడిన అసలు ఫెయిల్ అవ్వకుండా సూపర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు…

ఇక మన బౌలర్ల విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో బుమ్రా మాక్సిమమ్ అందుబాటులో ఉండడు కాబట్టి షమీ ఆయన ప్లేస్ లో బరిలోకి దిగుతాడు.అయితే షమీ వీళ్ళని ఎంతమేరకు తన బౌలింగ్ తో కట్టడి చేయగలడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే షమీ కి వీళ్ల మీద మంచి రికార్డు అయితే లేదు కానీ ఒకవేళ ఈ మ్యాచ్ లో ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. ఇక మనకు పేస్ బౌలింగ్ లో ఉన్న ఒకే ఒక అండ మహమ్మద్ సిరాజ్…సిరాజ్ ప్రపంచం లోనే అత్యుత్తమమైన బౌలర్ అని చెప్పడం లో ఎంత మాత్రం సందేహం లేదు ఇక పాకిస్థాన్ బ్యాట్స్మెన్స్ ని కట్టడి చేయడంలో ఆయన కీలక పాత్ర వహిస్తాడు అనే చెప్పాలి…ఇక ఇషాన్ కిషన్ ఇప్పటికే రీసెంట్ గా తాను ఆడిన 4 ఇన్నింగ్స్ ల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్ ని డిసైడ్ చేయడం లో ఇషాన్ కిషన్ కూడా కీలక పాత్ర వహిస్తాడు…ఇక ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, మహమ్మద్ సిరాజ్ లు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర వహించబోతున్నారు…

గత మ్యాచ్ లో షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో అవుట్ అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆయన మీద ఈ మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ మ్యాచ్ లో ఆయన బౌలింగ్ ని దీటు గా ఎదురుకొని టీం కి భారీ స్కోర్ అందిస్తేనే పాకిస్థాన్ మీద మనం ఆధిపత్యం చెలాయించగలుగుతాం లేకపోతే మన టీం చాలా వరకు వెనకబడిపోక తప్పదు…

ఇలా రెండు జట్ల ప్లేయర్ల మధ్య మంచి పోటీ అయితే ఉంది అందుకే ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం కూడా ఎదురుచూస్తుంది.ఇండియా గెలిచి మన ఇండియన్ పవర్ ఏంటి చూపించాల్సిన సమయం కూడా వచ్చేసింది. పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్లు చేసిన కామెంట్ల కి మనం గెలుపుతోనే సమాధానం చెబుదాం…

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version