Sanjiv Goenka: అది 2024.. ఐపీఎల్ సీజన్.. హైదరాబాద్, లక్నో జట్లు పోటీ పడుతున్నాయి. లక్నో విధించిన లక్ష్యాన్ని హైదరాబాద్ ప్లేయర్లు అత్యంత సునాయాసంగా చేదించారు.. లక్నో బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తీసి అవతలపడేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమిది.
నాటి మ్యాచ్ ను లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గో ఇంకా వీక్షించాడు. తమ జట్టు ప్లేయర్లు అలా ఆడుతున్న విధానాన్ని చూసి బాధపడ్డాడు. కాకపోతే ఆ బాధను అతడు మనసులో దాచుకోలేకపోయాడు. తన పక్కనే ఉన్న కెప్టెన్ కే ఎల్ రాహుల్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఆడితే ఎలా అంటూ మండిపడ్డాడు. అసలే సున్నిత మనస్కుడైన కేఎల్ రాహుల్ తదుపరి మ్యాచ్ దూరమయ్యాడు. అంతేకాదు, ఆ సీజన్ నుంచి లక్నో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తదుపరి సీజన్లో అతడు ఢిల్లీ జట్టుకు మారిపోయాడు. ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గోయంక తీరు వల్ల అతడు తట్టుకోలేక బయటకు వెళ్లిపోయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై రాహుల్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
రాహుల్ ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత రిషబ్ పంత్ ను గోయంక ఢిల్లీ జట్టు నుంచి తీసుకున్నాడు. అతడికి సారధిగా బాధ్యతలు అప్పగించాడు. అతడికి ఏకంగా 27 కోట్లు చెల్లించాడు.. అంతేకాదు వచ్చే పదిహేను సంవత్సరాల లో రిషబ్ పంత్ 5 ట్రోఫీలు గెలిచి.. ధోని, రోహిత్ పక్కన నిలుస్తాడని గోయంక వ్యాఖ్యానించాడు. కానీ రెండు సీజన్లు కూడా పంత్ నాయకుడిగా ఉండలేకపోయాడు. ఈ సీజన్లో దారుణంగా ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో పంత్ జట్టు సారధిగా తప్పుకున్నాడు.
సంజీవ్ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే అతడు సారధిగా తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. విపరీతమైన ఒత్తిడి పెంచడం.. ప్రతి మ్యాచ్లో గెలవాలి అని కోరుకోవడం.. ఐపీఎల్ ట్రోఫీ సాధించాలని పదేపదే నిర్దేశించడంతో పంత్ ఇబ్బందిపడ్డాడని.. అందువల్లే జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గోయంక లక్నో జట్టు యజమానిగా ఉన్నంతవరకు ఆ జట్టులో ఎవరూ ఆడేందుకు ముందుకు రారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..
