MS Dhoni: ధోని ని క్రికెట్ లో గొప్ప నాయకుడు అనడానికి ఈ ఒక్క సంఘటన చాలు…

వెస్టిండీస్ తో ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ బ్రెయిన్ లారా, అలాగే ఇండియన్ టీం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వీళ్లిద్దరి కెప్టెన్సీలో ఆడిన ఈ టెస్ట్ మ్యాచ్ లో వసీం జాఫర్ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు.

Written By: Gopi, Updated On : November 6, 2023 12:11 pm
Follow us on

MS Dhoni: ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక అద్భుతమైన కెప్టెన్… ఇండియన్ టీమ్ తల రాత మార్చిన కెప్టెన్ కూడా ధోనీ నే…ఇక ఆయన గురించి ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు, ఇలాంటి దిగ్గజ కెప్టెన్ కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో తను ఆడిన జెన్యూన్ ఆటకి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. 2006లో వెస్టిండీస్ తో ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ లో ధోని అద్భుతమైన న్యాయకత్వ లక్షణాన్ని చూపిస్తూ ఫ్యూచర్ లో నాయకుడు అవుతాడు అని అదే సమయం లో నిరూపించుకున్నాడు.

వెస్టిండీస్ తో ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ బ్రెయిన్ లారా, అలాగే ఇండియన్ టీం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వీళ్లిద్దరి కెప్టెన్సీలో ఆడిన ఈ టెస్ట్ మ్యాచ్ లో వసీం జాఫర్ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు. ఇక అదే దిశగా ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఎమ్మెస్ ధోని, మహమ్మద్ కైఫ్ ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా ఆడుతున్న క్రమంలో ధోనీ కొట్టిన ఒక షాట్ కొడతాడు దాన్ని బౌండరీ లైన్ దగ్గర డారెన్ గంగా క్యాచ్ పడతాడు. అలాంటి సమయంలో ఎంపైర్ అది సిక్స్ వెళ్లిందా లేదా ఔట్ అయిందా అనేది కచ్చితంగా తేల్చలేని పరిస్థితిలో థర్డ్ ఎంపైర్ కి టీవీ రిప్లై ఇస్తాడు. ఇలాంటి క్రమంలో కూడా అది క్లారిటీగా ఏర్పడకపోవడంతో థర్డ్ ఎంపైర్ అది నాటౌట్ గా ప్రకటిస్తాడు.

కానీ ఇదే క్రమంలో డారెన్ గంగా మాత్రం అది అవుట్ అని కచ్చితంగా వాదిస్తాడు. దాంతో డారెన్ గంగ ,బ్రియాన్ లారా ఇద్దరు కూడా ఎంపైర్ దగ్గరికి వచ్చి మీరు ఎలా చెప్తారు అది అవుట్ కాదు అని అక్కడ క్యాచ్ పట్టిన ప్లేయర్ చెప్పేది అర్థం చేసుకోవాలి కదా అన్నట్టుగా ఎంపైర్ తో మాట్లాడుతాడు. దాంతో ఎంపైర్ నేనేం చేయలేను అని చెప్పడం తో బ్రియాన్ లారా ధోని దగ్గరికి వచ్చి డారెన్ గంగ అబద్దం ఆడాడు ఆయన అవుట్ అంటున్నాడు అంటే అది కచ్చితంగా అవుటే అని ధోనితో చెప్పడంతో అంత దిగ్గజ క్రికెటర్ అండ్ కెప్టెన్ అయిన బ్రియాన్ లారా ఈ విషయంలో అబద్ధం ఎందుకు ఆడతాడు అనే ఉద్దేశ్యంతో ఆలోచించిన ధోని ఆయనని అర్థం చేసుకొని ఔట్ గా తనకు తానే నిర్ణయించుకొని గ్రౌండ్ నుంచి పెవిలియన్ కి వెళ్లిపోయాడు.

ఇక ఇదంతా చూసిన ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు అలాగే ప్రపంచ క్రికెట్ అభిమానులు సైతం ధోనీకి ఫిదా అయ్యారు.ఎంపైర్ నాట్ ఔట్ అని చెప్పిన కూడా అది ధోనీకి సాటిస్ఫైడ్ గా అనిపించకపోవడం తో తను గ్రౌండ్ నుంచి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఇలాంటి క్రమంలో ధోని అప్పుడే తన నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటంగా ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ధోని ఫ్యూచర్ లో దిగ్గజ కెప్టెన్ గా ఎదిగాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఈ మ్యాచ్ తర్వాత బ్రియాన్ లారా కూడా ధోని గురించి ఆయన చూపించిన జన్యునిటీ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. స్పోర్ట్స్ లో ఇలాంటి సంఘటనలను చాలా అరుదుగా చూస్తాం అందులో ఎమ్మెస్ ధోని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం తో ఇండియన్ టీమ్ లో ఇలాంటి ప్లేయర్ ఉండటం ఇండియన్ టీమ్ అదృష్టం అంటూ అందరూ ధోనీ తో పాటు గా ఇండియన్ టీమ్ ని కూడా ప్రశంసించారు…