https://oktelugu.com/

IPL 2023 – CSK win : సెటైర్ : చెన్నై సూపర్ కింగ్స్ గెలుపునకు ఇతనే కారణమట!

ఓ చెన్నై సూపర్ కింగ్స్ డైహార్ట్ ఫ్యాన్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. కూర్చీలో కూర్చుంటే కాలు నిలబడలేదు. వెంటనే టీవీ ముందుకు వచ్చాడు. చివరి రెండు బంతులకు ఆ దేవుడిని వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ హంగామా చేశాడు. ‘ఓం శక్తి, ఓం శక్తి అంటూ దేవుళ్లందరికీ పూజలు చేశాడు. ఆ పూజలు ఫలించాయి. అతడు కోరుకున్నట్టే చివరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి జడేజా గెలిపించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2023 / 05:30 PM IST
    Follow us on

    IPL 2023 – CSK win : ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ లో నాటకీయంగా గెలిచింది. ఆ గెలుపును ఎవరూ మరిచిపోలేరు. ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజీ సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. ఐదోసారి ట్రోఫీ అందించాడు. అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసినందుకు ఎప్పుడూ నిగ్రహంగా ఉండే ఎంఎస్ ధోని సైతం రవీంద్ర జడేజాను అమాంతం ఎత్తుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.

    అయితే రవీంద్ర జడేజా సైతం ఇది ధోని కోసం గెలిపించాలని కసిగా ఆడినట్టు తెలిపారు. ఆటగాళ్లంతా కూడా ధోని వల్లే గెలిచామని అన్నారు. కానీ అందరూ అనుకుంటున్నట్టు ఫ్యాన్స్ అనుకోరు కదా.. చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి ఓ వ్యక్తి కారణమని ఇప్పుడు ట్విట్టర్ ఫేస్ బుక్ లో హోరెత్తిస్తున్నారు.

    ఓ చెన్నై సూపర్ కింగ్స్ డైహార్ట్ ఫ్యాన్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. కూర్చీలో కూర్చుంటే కాలు నిలబడలేదు. వెంటనే టీవీ ముందుకు వచ్చాడు. చివరి రెండు బంతులకు ఆ దేవుడిని వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ హంగామా చేశాడు. ‘ఓం శక్తి, ఓం శక్తి అంటూ దేవుళ్లందరికీ పూజలు చేశాడు. ఆ పూజలు ఫలించాయి. అతడు కోరుకున్నట్టే చివరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి జడేజా గెలిపించాడు.

    ఆ తర్వాత ఆ చెన్నై అభిమాని సంబరం చూడాలి. గుండెలు బాదుకుంటూ చప్పట్లు కొడుతూ గెలిచామని బట్టలు చింపేసుకున్నాడు. అతడి సంబరాలు.. గెలుపు కాంక్ష చూసి.. జడేజా వల్ల చెన్నై గెలవలేదని.. కేవలం ఈ చెన్నై అభిమాని వల్లనే చెన్నై గెలిచిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.