Sarfaraz Khan Weight Loss: టీమిండియా టెస్ట్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఒకసారిగా 17 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా భారత జట్టులోకి అతడు ప్రవేశించాడు. తనమీద జట్టు మేనేజ్మెంట్ పెట్టుకుని నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు.. గొప్ప ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. భవిష్యత్తు ఆశాకిరణం లాగా కనిపించాడు. బ్యాటింగ్ పరంగా అతడికి వంకపెట్టే అవకాశం లేకపోయినప్పటికీ.. అతని బరువు ప్రధాన అవరోధంగా మారింది. ముఖ్యంగా వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో అతడు తీవ్ర ఆయాసానికి గురయ్యాడు. దీంతో అప్పట్లో అతని పరిస్థితిని గమనించిన టీమిండియా కీలక ఆటగాడు రిషబ్ పంత్… ప్రత్యేకమైన వంటగాణ్ణి ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని సర్ఫరాజ్ కు వంటగాణ్ని ఏర్పాటు చేసిన విషయం బయటకు రాలేదు.
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు సర్ఫరాజ్ ఎంపిక కాలేదు. దీంతో అతడు దేశవాళీ సిరీస్ ఆడుతున్నాడని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. తన శరీర సామర్థ్యం మీద సర్ఫరాజ్ దృష్టి పెట్టాడు. ముఖ్యంగా అతడు తన తిండి విషయంలో చాలా జాగ్రత్తగా వహించాడు. గతంలో విపరీతమైన లావు ఉన్న అతడు.. ఇప్పుడు సన్న జాజి తీగలాగా కనిపిస్తున్నారు దీనికోసం గడచిన రెండు నెలల్లో అతను మైదానంలో తీవ్రంగా కసరత్తు చేశాడు. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. రెండు నెలలు అతడు 17 కిలోల బరువు తగ్గడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అతడు ఏం తిన్నాడు.. ఏం తింటే అంత బరువు తగ్గాడు.. అనే చర్చలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి.
Also Read: 6 సిక్సులు.. వెస్టిండీస్ పై చెడుగుడు.. ఆస్ట్రేలియాకు రాక్షసుడు దొరికాడు
గతంలో సర్ఫరాజ్ బిర్యానీలు అవలీలగా తినేవాడు. రోటీలు విపరీతంగా ఆరగించేవాడు. అన్నం కూడా భారీగా తినేవాడు. అయితే బరువు తగ్గించుకునే ప్రక్రియలో వాటిని అతడు పూర్తిగా మానేశాడు. కూరగాయలు ఎక్కువగా తినడం మొదలుపెట్టాడు. ప్రోటీన్ కోసం చేపలు, కాల్చిన కోడి మాంసం, ఉడికించిన కోడి మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు తీసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మైదానంలో తీవ్రంగా కసరత్తు చేసేవాడు. వ్యాయామశాలలో సాధన చేశాడు. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో 17 కిలోల బరువు తగ్గాడు. ఇప్పుడు సన్నజాజి తీగలాగా కనిపిస్తున్నాడు.
వెయిట్ తగ్గడం పట్ల సర్పరాజ్ ఖాన్ పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.. గతంలో అతడు విపరీతంగా లావుగా ఉండేవాడని.. వికెట్ల మధ్యలో పరుగులు తీయడంలో ఇబ్బందిపడ్డాడని.. ఇప్పుడు వెయిట్ మొత్తం తగ్గించుకొని సన్నగా మారిపోయాడని.. ఆట మీద ఉన్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి ఆసక్తి ఉన్న ఆటగాడు కచ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.