PAK Vs SA : పాకిస్తాన్(Pakistan), దక్షిణాఫ్రికా(South Africa) జట్ల మధ్య క్రికెట్ జరుగుతోంది. సౌత్‌ఆఫ్రికాకు పాకిస్తాన్ వెళ్లింది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తాజాగా కేప్‌టౌన్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాదో ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట చాలా ఇబ్బంది పడింది. అయితే రెండో ఇన్నింగ్సలో బ్యాట్స్‌మెన్స్ అద్భుతమైనప్రదర్శన కనబర్చారు. అయితే అది పాకిస్తాన్ విజయానికి సరిపోలేదు.
దక్షిణాఫ్రికా భారీ స్కోర్..
రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ నిర్ణయం సరైనదని రుజువైంది. ర్యాన్ కికెల్టన్ డబుల్ సెంచరీ, టెంబా బావుమా–కైల్ వారెన్ సెంచరీలు చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 615 పరుగులు చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి తక్కువ స్కోర్ 194కే కుప్పకూలింది. ఫాలో ఆన్‌ను కాపాడుకోవడానికి 416 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.
పుంజుకున్న పాకిస్తాన్..
తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్ బ్యాట్‌సమెన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడారు. కెప్టెన్ షాన్ మసూద్ 145 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ 81 పరుగుల చేశాడు. ఇదే సమయంలో సల్మాన్ ఆఘా 48 పరుగులతో పాక్ జట్టు 478 పరుగులు చేసింది. ఫాలో ఆన్ తర్వాత పాకిస్థాన్‌కు అతిపెద్ద స్కోర్ నమోదు చేసింది. దక్షిణాప్రికాపై ఏ టెస్టు ఇన్నింగ్స్‌లోనూ పాకిస్తాన్ ఇంత భారీ స్కోర్ చేయడం ఇదే తొలిసారి. ఇక దక్షిణాఫ్రికా 58 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
పది వికెట్లతో విజయం..
ఈ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా సులభంగా విజంయ సాధించింది. కేవలం 58 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా గెలిచింది. 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2–0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచ కట్ టెస్ట్ సిరీస్ ఫైనల్ ఆడబోతోంది. తాజా విజయం ఆ జట్టు ఆటగాళ్ల మనోధైర్యాన్ని మరింత పెంచింది.