World Cup Final: 2003 వ సంవత్సరంలో భారీ ఆశలతో గంగూలీ సారధ్యంలోని ఇండియా టీమ్ వరల్డ్ కప్ లో అడుగు పెట్టింది.ఇక ఎక్కడ కూడా తడపడకుండ చాలా అంచనాలతో కప్పు కొట్టాలని ఫైనల్ బరిలోకి దిగింది. కానీ అక్కడ కంప్లీట్ గా అంచనాలు చేంజ్ అయి పోయాయి. నిజానికి అప్పట్లో ఆస్ట్రేలియా టీమ్ అంటే క్రికెట్ ప్రపంచం లో ఒక నియంత లాంటి టీమ్ ఎంత పెద్ద టీమ్ అయిన సరే ఆస్ట్రేలియా ను ఢీ కొట్టాలంటే చాలా భయపడిపోయేవి కానీ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ కి గట్స్ ఎక్కువ కాబట్టి ఏ మాత్రం భయం లేకుండా టీమ్ లో గెలుపు మీద ఆశలు రేకెత్తించేలా చేసి ప్లేయర్లతో పాటు తను కూడా బరిలోకి దిగాడు.
ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి ఇండియన్ టీమ్ ని డామినేట్ చేసింది…ఇక ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ సెంచరీ చేశాడు అలాగే డానియల్ మార్టిన్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా కి భారీ స్కోరు అందించారు. ఇక నిర్ణీత 50 ఓవర్ల కి 359 పరుగులు చేసింది.ఇక 360 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ లో ఒక సెహ్వాగ్, ద్రావిడ్ తప్ప ఎవరూ కూడా బాగా ఆడలేకపోయారు…
దాంతో ఇండియా ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది ఇక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియన్ టీమ్ మళ్ళీ వరల్డ్ కప్ లో తలపడుతున్నాయి…కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆస్ట్రేలియా కంటే ఇండియన్ టీమ్ చాలా స్ట్రాంగ్ అయింది. ఇండియన్ టీమ్ అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఇక ఇదే ఫామ్ లో ఆస్ట్రేలియా ని ఓడించడం పక్క అని టీమ్ ఇండియన్ ప్లేయర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
ఇక నిజానికి ఆస్ట్రేలియా టీమ్ లో 2003 వ సంవత్సరం లో మెగ్రత్, బ్రెట్ లీ లాంటి టాప్ బౌలర్ ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా చాలా బాగుంది…అలాగే ఇండియన్ బౌలింగ్ అప్పుడు అంత స్ట్రాంగ్ గా లేదు అందుకే ఆస్ట్రేలియా అంత స్కోర్ చేయగలిగింది…కానీ ఇప్పుడు ఇండియన్ టీమ్ బౌలింగ్ లో ప్రపంచం లోనే నెంబర్ వన్ స్థానం లో ఉంది. అలాగే బ్యాటింగ్ లో కూడా నిలకడగా ఆడే ప్లేయర్లు ఉండటంతో ఇండియన్ టీమ్ ని ఓడించడం ఆస్ట్రేలియా టీమ్ వల్ల కాదు. 2003 టైంలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ తీసుకొని చాలా ఎక్కువ పరుగులు చేసి మన ప్లేయర్లను సైకలాజికల్ గా దెబ్బ కొట్టింది…కానీ ఇప్పుడు ఆ పప్పులన్ని ఉడకవు ఎందుకంటే వాళ్ళు నాలుగు వందలు కొట్టిన మన ప్లేయర్లు ఆ స్కోర్ కొట్టడానికి రెఢీ గా ఉన్నారు…ఆల్రెడీ ఒకసారి లీగ్ దశలో ఓడించాం కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఓడించి ఇండియన్ టీమ్ పవర్ ఏంటో చూపించాలి…
ఇక పర్టిక్యూలర్ గా చెప్పాలంటే 2003 లో ఆస్ట్రేలియా టీమ్ లో ఉన ప్లేయర్ లలో ఓపెనర్స్ అయిన గిల్ క్రిస్ట్, హెడన్ లా దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు అలాగే బౌలింగ్ లో మాత్రం ఆ టీమ్ ని వరల్డ్ లోనే ఎవ్వరూ బీట్ చేయ లేకుండా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు రోజులు మారాయి…ఇపుడున్న బౌలర్లు బాల్ తో అంత మ్యాజిక్ చేయలేక పోతున్నారు.ఇక టీమ్ లో నిలకడ గా ఎక్కువ సేపు ఒకప్పుడు పాటింగ్ లా ఇప్పుడు ఆడే ప్లేయర్లు లేరు ఇక మిడిల్ ఆర్డర్ లో ఒక పెద్ద నాక్ ఆడే ప్లేయర్లు ఎవరు లేరు మాక్స్ వెల్ రూపం లో ఒక హిట్టర్ మాత్రం ఉన్నాడు…ఇక నిన్న సౌతాఫ్రికా మీద అంత తక్కువ స్కోర్ చేయడానికి వాళ్లు పడిన ఇబ్బందిని చూస్తే మనకు అర్థం అవుతుంది వాళ్ల మిడిల్ ఆర్డర్ ఎంత వీక్ గా ఉందో….
ఇక మనం కూడా గతం గురించి వదిలేస్తేఈసారి మాత్రం ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ టీమ్ భారీ ప్రణాళిక తో రెఢీ గా ఉంది…ఇక సమయం లేదు, శరణు లేదు. గర్వనికి, గౌరవానికి మధ్య జరిగే ఈ పోరు లో బరిలో నిలిచి ఆ తర్వాత గెలిచి కప్పు కొట్టడమే మన ముందు ఉన్న లక్ష్యం…