Viral Video : ఆ సంఘటన తర్వాత పాకిస్తాన్లో దాదాపు చాలా సంవత్సరాల పాటు ఐసీసీ ఏ మెగా టోర్నీని కూడా నిర్వహించలేదు. అప్పుడెప్పుడో 1996 తర్వాత మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్లో ఐసిసి టోర్నీని నిర్వహిస్తోంది.. దీనికోసం పాకిస్తాన్ అసాధారణమైన భద్రత ఏర్పాటు చేస్తోంది. దాదాపు 13 వేల మంది పోలీసులను ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మొహరించిందంటే పాకిస్థాన్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులు.. వారికి అనుబంధంగా పనిచేసే సంస్థలతో పాకిస్తాన్ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. పైగా అక్కడి రాజకీయ అనిశ్చితి వాతావరణం నిత్యం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ముందుకు రారు.. అక్కడి వాతావరణం కూడా బాగోదు. పైగా ఆటగాళ్లు బయటికి వెళ్లాలంటే ఏ మాత్రం కుదరదు.. హోటల్లో బస చేసే ప్రాంతం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అక్కడ నుంచి మొదలు పెడితే మైదానం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అందువల్లే విదేశీ ఆటగాళ్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాకిస్తాన్లో క్రికెట్ ఆడలేరు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్ ఆటగాళ్లు చాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోవడానికి ప్రధాన కారణం కూడా అదే.
ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న వీడియో పాకిస్తాన్లో ఉన్న దయనీయ పరిస్థితిని వెల్లడిస్తోంది. హోటల్ రూమ్ నుంచి మైదానానికి బయలుదేరిన ఆటగాళ్ల బస్సుకు పాకిస్తాన్ ప్రభుత్వం అసాధారణమైన భద్రతను ఏర్పాటు చేసింది. దాదాపు 20 వాహనాలు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సును అనుకరిస్తున్నాయి.. మైదానం దాకా అలానే తీసుకెళ్తున్నాయి..ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో భారత్ లో పర్యటించిన విదేశీ ఆటగాళ్లు సరదాగా జాగింగ్ చేయడం.. బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించడం.. ఉత్సాహంగా ఈత కొట్టడం వంటి దృశ్యాలను కొంతమంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్లో క్రికెట్ కు.. భారత్లో క్రికెట్ ఆడేందుకు తేడా ఇదీ అని ఉదాహరణలతో చూపిస్తున్నారు. అందువల్లే విదేశీ ఆటగాళ్లు భారత్లో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారని చెప్తున్నారు. ఉగ్రవాద దేశంలో క్రికెట్ ఆడేందుకు ఎవరు ముందుకు వస్తారని.. అందువల్లే భారత ఆటగాళ్లు పాకిస్తాన్లో ఆడకుండా.. దుబాయ్ లో ఆడతామని ఐసీసీకి స్పష్టం చేసింది ఇందుకేనని వారు చురకలు అంటిస్తున్నారు. ” పాకిస్తాన్లో భద్రత ఉండదు. గతంలో శ్రీలంక ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయే దశకు చేరుకున్నారు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. పాకిస్తాన్ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ఐసిసి టోర్నీ నిర్వహిస్తోంది అంటే సాహసం అనే చెప్పాలి. అలాంటి దేశంలోకి ఆడేందుకు భారత ఆటగాళ్లు వెళ్ళంది అందుకోసమేనని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Difference Is Clear #ChampionsTrophy2025 pic.twitter.com/DyfoGAS9nz
— Desidudewithsign (@Nikhilsingh21_) February 20, 2025