Team India won the World Cup: దశాబ్దాల ఎదురుచూపు తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ అందుకుంది. పడుతూ లేస్తూ సాగిన ప్రయాణాన్ని విజయతీరాల వైపు మళ్లించింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్లో ముంబై వేదిక మీద దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి 298 పరుగులు చేసింది. ఈ స్కోరును చేజ్ చేయడంలో దక్షిణాఫ్రికా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ లారా సూపర్ సెంచరీ తో అదరగొట్టింది. సహచర ప్లేయర్లు అంతగా సహకరించకపోయినప్పటికీ ఆమె ఒంటరి పోరాటం చేసింది.
టీమిండియా విజయం సాధించడం పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్లో భారీగా అంచనాలు పెట్టుకున్న స్మృతి.. తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేక పోయింది. జెమీమా ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ కౌర్ మధ్యలోనే నిష్క్రమించింది. ఈ సమయంలో టీం ఇండియా ఇన్నింగ్స్ కు వెన్నెముక మాదిరిగా నిలిచింది షెఫాలీ వర్మ(87).. సూపర్ హాఫ్ సెంచరీ తో పాటు కాప్, లూస్ వికెట్లను పడగొట్టింది. అంతకుముందు శ్రీ చరణి సత్తా చాటింది. తను కూడా అత్యంత ప్రమాదకరమైన బాష్ వికెట్ పడగొట్టింది. అంతేకాదు 9 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 48 పరుగులు ఇచ్చి.. దక్షిణాఫ్రికా జట్టుకు చుక్కలు చూపించింది.
ఇక టీమిండియా కు అత్యవసరమైన సందర్భంలో.. అది కూడా వికెట్లు కావలసిన సమయంలో తీసి నిరూపించింది దీప్తి శర్మ. జాఫ్టా, డెర్క్ సన్, ట్రయాన్, లారా, క్లార్క్ వికెట్లను తన ఖాతాలో వేసుకుంది దీప్తి.. ఈ మ్యాచ్లో అన్నిటికంటే ముఖ్యంగా లారాను అవుట్ చేసి దక్షిణాఫ్రికా జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది దీప్తి శర్మ. అంతేకాదు బ్యాటింగ్లో కూడా ఆమె అదరగొట్టింది. ఆల్ రౌండర్ అనే పాత్రకు సూపర్ న్యాయం చేసింది. 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అత్యుత్తమంగా బౌలింగ్ వేయడంతో ఈమెకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. అలాగే వర్మకు ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. కీలకమైన ప్లేయర్లు వెంట వెంటనే వెనక్కి వెళ్ళినప్పుడు వర్మ, శర్మ అదరగొట్టారు. అందువల్లే టీం ఇండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అంతేకాదు వన్డే క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ఘనతను అందుకుంది. అచ్చి వచ్చిన ముంబై గడ్డమీద మరోసారి జయకేతనం ఎగరవేసి విశ్వవిజేతగా నిలిచింది.