Best Opening Players: ఇంకో నాలుగు రోజుల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అన్ని టీమ్ లు కూడా దానికి సంబంధించిన పూర్తి ప్రిపరేషన్ ని రెడీ చేసుకొని మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ఇక అందులో భాగంగానే టాప్ ఫైవ్ టీమ్స్ యొక్క ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం… అలాగే ఏ టీమ్ ఓపెనింగ్ పాత్నర్షిప్ ని సాధించడం లో స్ట్రాంగ్ గా ఉంది అనేది నెంబర్ 5 నుంచి నెంబర్ 1 దాకా ఒక్కసారి మనం లిస్ట్ అవుట్ చేసి చూసుకుందాం…
ముందు గా నంబర్ 5 లో పాకిస్తాన్ కు చెందిన ఫకర్ జమాన్ అండ్ ఇమాముల్ హక్ ఉన్నారు.వీళ్ళిద్దరూ కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ పాకిస్తాన్ టీం కి చాలా మ్యాచుల్లో మంచి విజయాలను అందించారు.నిజానికి వీళ్ళ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కనక ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పటివరకు వీళ్లు 2482 రన్స్ చేశారు. ఇక వీళ్ళ పాత్నార్షిప్ లో ఏడుసార్లు 100కు పైగా పరుగులు చేశారు.అలాగే 11 సార్లు 50 పై పాత్నార్ షిప్ ని నెలకొల్పారు. ఇక అందులో భాగంగానే వీళ్ళ ఆవరేజ్ లు కూడా సూపర్ గా ఉన్నాయి.ముందుగా ఫకర్ జమాన్ అవరేజ్ 45.4 కాగా, ఇమాముల్ హక్ అవరేజ్ 50.4 గా ఉంది. ఇక వీళ్లిద్దరూ కూడా బెస్ట్ ఓపెనర్లుగా అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లుగా ఉన్నారు.ఇక ఇందులో ఫకర్ జమాన్ ప్రస్తుతం అంత ఫామ్ లో లేనప్పటికీ ఇమామ్ ఉల్ హక్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు.అయితే ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా ప్రత్యర్థి జట్లను చాలా వరకు ఇబ్బంది పెట్టి అవకాశం అయితే ఉంది…
ఇక నెంబర్ 4 ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కనక చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ టీమ్ కి చెందిన బెయిర్ స్ట్రో అండ్ డేవిడ్ మలన్ ఇద్దరూ కూడా మంచి ఓపెనర్లు గా గుర్తింపు పొందిన వారే…అయితే ఇంగ్లాండ్ టీమ్ ప్లేయర్లను అనౌన్స్ చేసినప్పుడు ఈ టీమ్ లో బేయిర్ స్ట్రో అండ్ జాసన్ రాయ్ ఇద్దరు ఓపెనర్లు గా వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ రాయ్ టీమ్ నుంచి బయటికి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుతం బెయిర్ స్ట్రో అండ్ మల్లన్ ఇద్దరు ఓపెనింగ్ చేయబోతున్నారు.ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలిసి రెండు మ్యాచ్ ల్లో మాత్రమే ఓపెనింగ్ చేశారు. అందులో 24 పరుగుల పాత్నా ర్ షిప్ మాత్రమే నెలకొల్పారు.ఇక అయినప్పటికీ వీళ్ళ పర్సనల్ ఓపెనింగ్ అవరేజ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది.బెయిర్ స్ట్రో కి 47 అవరేజ్ ఉండగా,మలన్ కి మాత్రం 56 అవరేజ్ ఉంది.కాబట్టి వీళ్లిద్దరూ కూడా చాలా వరకు వరల్డ్ కప్ లో ఆపోజిట్ టీమ్ మీద వాళ్ల ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే వీళ్లిద్దరూ కూడా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కాబట్టి బ్యాటింగ్ కూడా ఆ టీమ్ కి చాలా హెల్ప్ అవుతుంది…
ఇక నెంబర్ త్రీ లో సౌత్ ఆఫ్రికా కు చెందిన క్వింటన్ డికాక్ అండ్ భావుమా ఇద్దరు కూడా ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక ఇప్పటివరకు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ ఓపెనింగ్ పాత్నార్ షిప్ లో 775 రన్స్ చేశారు. ఇక ఆవరేజ్ కూడా 70 గా ఉండడం విశేషం…ఇందులో వందకు పైన మూడు సార్లు పాత్నార్ షిప్ నెలకొల్పితే , నాలుగు సార్లు 50 కి పైన పాత్నార్ షిప్ నెలకొల్పారు. అయితే ఇద్దరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కూడా చాలా స్లోగా, స్టడీగా మ్యాచ్ లు ఆడతారు. అంటే ఫస్ట్ బాల్ నుంచి దూకుడుగా ఆడే స్వభావం ఇద్దరికీ లేకపోవడమే ఈ టీం కి కొంచెం మైనస్ గా మారింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తే పర్లేదు కానీ చేజింగ్ కి వచ్చి వీళ్లు ఎక్కువగా రన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా స్లోగా ఆడితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.అలాంటి టైం లో పవర్ ప్లే లోనే ఎక్కువ రన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక వీళ్లలో ఒకరు అగ్రేసివ్ గా ఆడితే టీం కి మరింత బలాన్ని చేకూర్చిన వారు అవుతారు…
ఇక నెంబర్ 2 బెస్ట్ ఓపెనింగ్ జోడీ విషయానికి వస్తే ఆస్ట్రేలియాకి చెందిన వార్నర్ అండ్ హెడ్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వాళ్ల లో రెండో స్థానంలో ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటివరకు వాళ్ల ఫాత్నార్ షిప్ లో 1000 రన్స్ ని చేశారు. అందులో అవరేజ్ కూడా 90.9 గా ఉండడం విశేషం అనే చెప్పాలి.అందులో నాలుగు సార్లు 100 కంటే ఎక్కువ పాత్నార్ షిప్ ని నెలకొల్పారు. ఒకసారి 50 కంటే ఎక్కువ పరుగుల పాత్నార్ షిప్ ని నెలకొల్పారు.ఇక 11 మ్యాచుల్లో నాలుగు సార్లు 100 కి పైన పాత్నార్ షిప్ ని నెలకొల్పారు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు హెడ్ కి కొంచెం ఇంజురీ అవ్వడం వల్ల వరల్డ్ కప్ లో వాళ్ల టీమ్ ఆడే మొదటి కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉంటాడా..?లేదా అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ హెడ్ కనుక అందుబాటులో లేకపోతే ఆయన ప్లేస్ లో మిచెల్ మర్ష్ ఓపెనింగ్ చేయడానికి వస్తాడు…అయితే వార్నర్ కి మార్ష్ కి కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఉన్నప్పటికీ వార్నర్ కి హెడ్ కి ఇంకా మంచి పాత్నార్ షిప్ అనేది ఉంది…
ఇక ఓపెనింగ్ భాగస్వామ్యాలలో నెంబర్ వన్ ఓపెనింగ్ భాగస్వామ్యంగా చెప్పుకునే ప్లేయర్లు ఎవరంటే ఇండియా కి చెందిన రోహిత్ శర్మ అండ్ శుభ్ మన్ గిల్… వీళ్లిద్దరిని కూడా నెంబర్ వన్ ఓపెనర్లుగా చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…ఎందుకంటే ఇప్పటివరకు వీళ్లు 13 మ్యాచులు ఆడితే అందులో 1048 రన్స్ చేశారు. ఇక ఆవరేజ్ వచ్చేసి 87.3 గా ఉంది. అందులో నాలుగు సార్లు 100కి పైన వాళ్ల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, ఐదు సార్లు 50 పైన పరుగులు చేశారు. ఇక వీళ్ళు ఆడిన 13 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ ల్లో సక్సెస్ అయ్యారు. కేవలం నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే వీళ్ళు కొంతవరకు ఫెయిల్ అయ్యారు. ఇక ఈ కాంబినేషన్ కూడా యూత్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కాంబినేషన్ కావడం టీమ్ కి చాలా ప్లస్ అవుతుంది.ఇక ఇప్పటి వరకు చెప్పిన ఓపెనింగ్ ప్లేయర్ల లో ఎవరు కూడా ఇలా లేరు…రోహిత్ శర్మ కి గిల్ కి మధ్య దాదాపుగా పది సంవత్సరాల తేడా ఉంటుంది. అందుకే యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కాంబినేషన్ గా మనం ఈ ఓపెనర్లును అభివర్ణించవచ్చు. ఇక అలాగే సెపరేట్ గా చూసుకుంటే రోహిత్ శర్మ ఆవరేజ్ 56.5 గా ఉంది,అలాగే గిల్ ఆవరేజ్ 60.5 గా ఉంది అంటే వీళ్ళిద్దరిది కూడా 50 పైనే ఆవరేజ్ ఉండడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…