Odi World Cup 2023: రెండు నెలలుగా చప్పిడిగా సాగిన మ్యాచ్ లవీ.. వరల్డ్ కప్ ఊపే లేదు.. ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తూ నీరసించారు ప్రేక్షకులు.. కానీ ఆ సమయం రానే వచ్చింది.. ఎట్టకేలకు చివరి అంకంలో గెలవాల్సిన పరిస్థితుల్లో అన్ని జట్లు తమ శాయశక్తులు ఒడ్డుతున్నాయి.. మొన్న పాకిస్తాన్ వీరోచిత పోరాటం.. తర్వాత బంగ్లాపై శ్రీలంక ఉద్రిక్త వాతావరణం.. నిన్న అప్ఘన్, ఆస్ట్రేలియాల అద్భుత ఆరాటం.. వెరసి ప్రపంచకప్ కు ఊపొచ్చింది.. సెమీస్ రేసును సంక్లిష్టంగా మార్చింది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ కు అర్హత సాధించగా ఆ ఒక్క స్థానం కోసం ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ రేసులో నిలిచాయి. మరి ఆ సెమీఫైనల్ లో తలపడే ఆఖరు జట్టు ఏంటన్న దానిపై స్పెషల్ ఫోకస్…
వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి టీమ్ కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే లీగ్ మ్యాచ్ లు తుది దశ చేరుకున్న సమయంలో ఇప్పటికే సెమీ ఫైనల్ కు వెళ్లాల్సిన మూడు టీములు ఖరారు అయ్యాయి.ఇక నెంబర్ ఫోర్ లోసెమీస్ కు చేరుకునే టీం ఏది అనే దాని మీదనే ఇప్పుడు పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ టీం ఘన విజయం సాధించడం తో నెంబర్ త్రీ పోజిషన్ లో ఆస్ట్రేలియా సెమిస్ కి క్వాలిఫై అయిది.
నెంబర్ ఫోర్ పోజిషన్ కోసం పాకిస్తాన్,న్యూజిలాండ్,ఆఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ లాంటి టీములు పోటీ పడుతున్నాయి. అయినప్పటికీ నెంబర్ ఫోర్ పొజిషన్ కి చేరుకొనే సత్తా ఉన్న టీం ఏది అనేది క్లారిటీ అయితే రావడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి టీం కూడా తమ తమ వ్యూహాలతో జరగబోయే మ్యాచ్ లను గెలవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే న్యూజిలాండ్ టీం శ్రీలంక మీద జరగబోయే మ్యాచ్ లో ఒక భారీ విక్టరీ కొడితే తప్ప సెమిస్ కి క్వాలిఫై అవ్వడానికి అవకాశం లేదు… నిజానికి టోర్నీ మొదట్లో న్యూజిలాండ్ టీం ఆడిన మ్యాచ్ లను చూస్తే ఈ టోర్నీలో మొదట సెమీస్ కి క్వాలిఫై అయ్యే టీం న్యూజిలాండ్ టీమ్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓటమితో న్యూజిలాండ్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే చివరి మ్యాచ్ మీద హోప్స్ పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ టీం కూడా సెమీస్ కి క్వాలిఫై అవ్వాలి అంటే తను ఇంగ్లాండ్ మీద ఆడబోయే చివరి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనని చూపించాలి. లేకపోతే సెమిస్ కి చేరుకోవడం చాలా కష్టమవుతుంది. పాకిస్తాన్ టీం మొదట్లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా మ్యాచులు ఓడిపోవడంతో ఒక ద సెమీస్ రేస్ లో చాలావరకు వెనుకబడిపోయారు. మరి ఇంగ్లాండ్ మీద భారీ విక్టరీ కొట్టి సెమీస్ కి క్వాలిఫై అవ్వాలనే దృఢ సంకల్పంతో పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారు.ఇక ఇంగ్లాండ్ టీమ్ ఇప్పటికే ఆల్రెడీ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది కాబట్టి దాన్ని ఓడించడం పెద్ద విషయం అయితే కాదు. కానీ ఈ వరల్డ్ కప్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి ఏమీ తెలియడం లేదు.ప్రతిదీ సస్పెన్స్ గానే సాగుతుంది. కాబట్టి పాకిస్తాన్ వరల్డ్ కప్ కి రావాలంటే ఒక అద్భుతం జరగాల్సిందే…
ఈ టోర్నీ లోకి పసికూనగా వచ్చి అద్భుతాలను క్రియేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీస్ రేస్ లో ఇప్పటికీ అలానే ఉంది. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ విధ్వంసానికి బలి అయిన ఆఫ్ఘనిస్తాన్ ఆ మ్యాచ్ లో భారీ విక్టరీ కొట్టి ఆస్ట్రేలియాకు జలకిస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఈ మాక్స్ వెల్ మొత్తం లెక్కలన్నీ మార్చేశాడు. దాంతో ఆఫ్గనిస్తాన్ టీమ్ కూడా ఇప్పుడు సౌతాఫ్రికా తో ఆడే మ్యాచ్ లో గెలవాల్సి ఉంది…
ఇక నెదర్లాండ్స్ టీమ్ విషయానికి వస్తే వీళ్ళు కూడా సౌగాఫ్రికా లాంటి ఒక పెద్ద జట్టుకి జలకిచ్చి ఒక భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఈ రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే వీళ్ళు టోర్నీలో సెమీఫైనల్ కి క్వాలిఫై అవుతారు. లేకపోతే మాత్రం లీగ్ దశ నుంచే వెనుతిరగాల్సి ఉంటుంది…
ఇక ఇప్పటికే ఒక సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీం లు తలపడబోతున్నాయి అనేది దాని మీద క్లారిటీ వచ్చేసింది. ఇక ఇండియాతో తలపడే టీం ఏది అనే దాని మీదనే పలు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ , నెదర్లాండ్స్ ఈ నాలుగింటిలో ఇండియాను ఢీకొట్టే టీం ఏది అనే దాని మీదనే ఒక క్లారిటీ అయితే రావడం లేదు. మరి ఏ టీం ఇండియా తో పాటు పోటీ పడుతుందో చూడాలి…