Border Gavaskar Trophy 2025 : ఇక అంతకుముందు భారత – ఏ జట్టు ఆస్ట్రేలియా – ఏ జట్టుతో తలపడింది. రెండు అనధికారిక టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. ఇక గత రెండు సీజన్లో భారత్ ఆస్ట్రేలియా పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు గెలుచుకుంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇక ఇటీవల స్వదేశంలో భారత్ న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టులలో ఓడిపోయింది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. దీంతో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది. ఐదు టెస్టుల సిరీస్ ను 4-0 గెలుచుకుంటేనే వరాలు టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈసారి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.. ఆస్ట్రేలియా జట్టులో విజయవంతమైన కెప్టెన్ గా పేరుపొందిన పాంటింగ్ రెండవ స్థానంలో ఉన్నాడు..
సచిన్ టెండూల్కర్
34 మ్యాచ్లలో 3,262 పరుగులు చేసి.. హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
రికి పాంటింగ్
29 టెస్టులు ఆడిన ఇతడు.. 2,555 రన్స్ చేసి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్
29 టెస్టులు ఆడి 2,434 రన్స్ చేసి.. సచిన్ తర్వాత రెండవ హైయస్ట్ స్కోర్ చేసిన భారత ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ద్రావిడ్
32 టెస్టులు ఆడిన రాహుల్ ద్రావిడ్ 2,143 పరుగులు చేసి.. నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
మైకేల్ క్లార్క్
22 టెస్టులు ఆడిన క్లార్క్.. 2,049 రన్స్ చేశాడు.. ఆస్ట్రేలియా తరఫున పాంటింగ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
పూజారా
పూజార ఇప్పటివరకు 24 టెస్టులు ఆడాడు. 2,043 పరుగులు చేసి ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 24 టెస్టులు ఆడాడు. 1,979 పరుగులు చేశాడు. ఏడవ హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
హెడెన్
ఆస్ట్రేలియా ప్రమాదకరమైన ఓపెనర్ హెడెన్ 18 టెస్టులు ఆడి..1,888 రన్స్ చేశాడు.
స్మిత్
ఆస్ట్రేలియా ఒకప్పటి కెప్టెన్ స్మిత్ 18 టెస్టులు ఆడి.. 1,887 రన్స్ చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ 22 టెస్టులు ఆడాడు. 1,738 రన్స్ చేశాడు.