Homeక్రీడలుక్రికెట్‌England vs Sri Lanka T20 World Cup Rain Threat: ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక:...

England vs Sri Lanka T20 World Cup Rain Threat: ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక: వరుణుడు కరుణిస్తేనే..

England vs Sri Lanka T20 World Cup Rain Threat: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మీద ఆసక్తి ఏర్పడింది. సరిగ్గా గత నెలలో ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఏ మేరకు శ్రీలంకను ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది..

శ్రీలంక జట్టులో నిస్సాంక, కుశాల్ మెండిస్ కీలకమైన ప్లేయర్లు గా ఉన్నారు. స్పిన్నర్ తీక్షణ, మధు శంక, చమీరా సత్తా చూపిస్తే ఇంగ్లాండ్ జతకు ఇబ్బందులు తప్పవు. శ్రీలంక జట్టును వైట్ వాష్ చేసిన నేపథ్యంలో.. ఈసారి కూడా అదే ఫలితాన్ని కొనసాగించాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది.

ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అయితే లంక జట్టుపై వైట్ వాష్ చేసిన నేపథ్యంలో బ్రూక్ సేన అదే జోరు కొనసాగించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీలంక జట్టు బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. అదే సమయంలో జింబాబ్వే జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టును ఏ మేరకు ప్రతిఘటిస్తుందనేది చూడాల్సి ఉంది.

ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కురిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఫలితంగా రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. దీంతో ఈ రెండు జట్లు తదుపరి జరిగే రెండు మ్యాచ్లలో విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ అందులో ఓటమిపాలైతే.. మిగతా జట్ల ఫలితాల ఆధారంగానే సెమీస్ కు వెళ్లే అవకాశాలుంటాయి.

ఈ మైదానంలో మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంకలో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా మ్యాచ్ ల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version