India Vs Sri Lanka: ఇండియా భారీ విజయం వెనక ఉన్న ప్లేయర్లు వీళ్లే…

కొత్త కుర్రాడు అయినా శ్రీలంక స్పిన్ బౌలర్ దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో ఇండియన్ టీం బ్యాట్స్ మెన్స్ ని చాలావరకు కట్టడి చేస్తూ తన చక్కటి బౌలింగ్ వేశాడు.

Written By: Gopi, Updated On : September 13, 2023 8:30 am

India Vs Sri Lanka

Follow us on

India Vs Sri Lanka: ఏషియా కప్ లో భాగంగా ఇండియా శ్రీలంక టీమ్ లా మధ్య ఈరోజు ఒక మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 49 ఓవర్ ఒక బాల్ కి 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక మన బ్యాట్స్ మెన్స్ అయిన రోహిత్ శర్మ 53 పరుగులు చేశాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చి 33 పరుగులు చేశాడు ఇక లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ కూడా 44 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా చివర్లో 26 పరుగులు చేశాడు.

ఇక పాకిస్తాన్ మీద భారీ పరుగులు చేసిన మన టీం శ్రీలంక మీద మాత్రం 213 పరుగులు చేసింది. దానికి కారణం ఆ పిచ్ స్పిన్ కి ఎక్కువగా అనుకూలిస్తూ ఉండడం అనేది మనం మ్యాచ్ చూస్తే మనకు అర్థమవుతుంది.

కొత్త కుర్రాడు అయినా శ్రీలంక స్పిన్ బౌలర్ దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో ఇండియన్ టీం బ్యాట్స్ మెన్స్ ని చాలావరకు కట్టడి చేస్తూ తన చక్కటి బౌలింగ్ వేశాడు. అలాగే ఐదు వికెట్లను కూడా తీసుకున్నాడు ఇక ఇండియా 213 పరుగులకు ఆల్ అవుట్ అయింది ఆ తర్వాత 214 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకన్ ప్లేయర్లకి మొదట్లోనే భారీ దెబ్బ పడింది ఓపెనర్ ప్లేయర్ అయిన నసంక 6పరుగులు చేశాక బుమ్రా అవుట్ చేశాడు దాంతో వాళ్ల టీం మొదట్లోనే ఓపెనిర్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్లేయర్ కూడా ఏమాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కానీ ధనుంజయ డిసిల్వా మాత్రం 41 పరుగులు చేశాడు. బౌలింగ్ లో అదరగొట్టిన దునీత్ వెల్లలాగే బ్యాటింగ్ లో కూడా చాలా చక్కటి ప్రదర్శనని కనబరిచాడు 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక ఎండ్లో ఆయన మ్యాచ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరొక ఎండ్లో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ గా నిలబడలేక పోయారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అవుట్ అయిపోయారు.ఇక ఇండియన్ బౌలర్ల గురించి చెప్పాలి అంటే పాకిస్తాన్ మ్యాచ్ మీద ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీశాడు… జడజ 2 వికెట్లు తీయగా, బుమ్రా కూడా రెండు వికెట్లు తీశాడు.ఇక సిరాజ్ , హార్దిక్ పాండ్యా ఇద్దరు తలో వికెట్ తీశారు… మొత్తానికైతే చివర్లో శ్రీలంకన్ ప్లేయర్లు ఆడిన ఆట ని చూసి మన టీమ్ ఓడిపోతుంది ఏమో అనే సందేహం కలిగింది కానీ చివర్లో మన బౌలర్లు అయినా హర్ధిక్ పాండ్య, కుల్డీప్ యాదవ్ ఇద్దరు కూడా చాలా మంచి బాల్స్ వేసి శ్రీలంక ప్లేయర్ల ను కట్టడి చేస్తూనే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తూ వికెట్లు తీశారు దాంతో వాళ్లు 172 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు.ఇక దాంతో ఇండియా 41 పరుగులతో శ్రీలంక మీద విజయం సాధించింది… ఇక దీంతో మన ఇండియా టీమ్ ఫైనల్ కి చేరుకుంది.పాకిస్తాన్ శ్రీలంక ఆడబోయే మ్యాచ్ లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు ఫైనల్ కి చేరుకుంటుంది…ఇక ఇండియా ఈ మ్యాచ్ గెలవడం వెనుక రాహుల్, ఇషాన్ కిషన్, బుమ్రా ,కుల్దీప్ యాదవ్ లు ముఖ్యపాత్ర పోషించారనే చెప్పాలి…