T20 World Cup: వార్మప్ మ్యాచ్ లలో ఎంత అదరగొట్టిందో.. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా అంతే తేలిపోయింది.కనీస పోటీ ఇవ్వకుండా చిత్తయ్యింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే పాకిస్తాన్ తో ఓటమి జీర్ణించుకోలేకుండా తయారైంది. ఎన్నో సంచలనాలు, వివాదాలకు దారితీస్తోంది.

పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో అన్నింటా పేలవ ప్రదర్శన చేసింది. పాకిస్తాన్ చేతిలో ఓడింది. పాక్ జట్టు మాత్రం వరుసగా మూడు విజయాలు సాధించి సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది.
పాకిస్తాన్ చేతిలో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య అక్టోబర్31న జరిగే మ్యాచ్ చావోరేవో.. ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇక భారత్ జట్టు సెమీస్ కు వెళ్లడం కష్టమే. అందుకే అసలు సిసలు మ్యాచ్ గా న్యూజిలాండ్ తో ఆదివారం జరుగనుంది.
గ్రూప్ బీలో ప్రస్తుతం టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ లకు సెమీస్ చేరే చాన్స్ ఉంది.అప్ఘనిస్తాన్ రేసులో ఉంది. స్కాట్ లాండ్, నమీబియాలకు కష్టమే.. రెండు స్థానాలకు ప్రధాన 3 జట్లు పోటీపడుతున్నాయి.ఇందులో ఒక స్థానం పాకిస్తాన్ కు దక్కేసింది.ఇంకోస్థానం కోసం న్యూజిలాండ్, ఇండియా పోటీపడుతున్నాయి.
న్యూజిలాండ్ తో భారత్ ఓడిపోతే మాత్రం కష్టాలే. అదే సమయంలో మిగతా అన్ని జట్లపై న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్ రెండోబెర్త్ లో వెళుతుంది. ఓడిపోతే అప్పుడు న్యూజిలాండ్ , భారత్ సమానం అవుతాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. ఈ సమీకరణాలతో పనిలేకుండా ముందడుగు వేయాలంటే మాత్రం ఖచ్చితంగా టీమిండియా న్యూజిలాండ్ తో ఆదివారం నెగ్గి తీరాల్సిందే.
ముఖ్యంగా ఓపెనర్లు టీమిండియాకు బాగా ఆడాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ నిలకడ, ఆరోబౌలర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ విషయంలో టీమిండియా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. మెరుగైన ఆటగాళ్లతో బరిలోకి దిగి గెలవాల్సి ఉంటుంది. మొదటి మ్యాచ్ లో జరిగిన ఈ తప్పిదాలు మళ్లీ పునరావృతం అయితే లీగ్ దశలోనే టీమిండియా ఓడిపోయి ఇంటికి పరిమితం కావడం ఖాయం.