https://oktelugu.com/

Varudu Kavalenu: ఘనంగా నిర్వహించిన వరుడు కావలెను సక్సెస్ మీట్…

Varudu Kavalenu: యువ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ  జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ సినిమా అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీంతో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా… సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 04:37 PM IST
    Follow us on

    Varudu Kavalenu: యువ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ  జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ సినిమా అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీంతో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

    ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా… సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం ‘దిగు దిగు దిగు నాగ’  అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ ఈ పాటను పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది.

    ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర ఒక కోటి నుండి 1.2 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావించినా.. 96 లక్షల రేంజ్ షేర్‌తో పరవాలేదనిపించింది. వరుడు కావలెను సినిమాను మొత్తంగా 8.6 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్‌గా అమ్మారు. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్లు టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా వరుడు కావలెను సినిమా ఇంకా 7.64 కోట్ల రేంజ్‌లో షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది.