క్రికెట్ అంటే మనలో చాలామంది బ్యాటింగ్ కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బౌలర్లకి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ఇక ఇలాంటి క్రమంలో కొంతమంది బౌలర్లు మాత్రం తమదైన రీతిలో సత్తా చాటుతు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో కాకుండా రిటైర్ అయ్యే చివరి రెండు, మూడు సంవత్సరాలలో టెస్ట్ క్రికెట్ లో తనదైన సత్తా చాటుతు మంచి గుర్తింపు పొందిన బౌలర్లు ముగ్గురు ఉన్నారు. అందులో మన ఇండియన్ బౌలర్ కూడా ఉండడం నిజంగా విశేషమనే చెప్పాలి.ఇక టెస్ట్ మ్యాచ్ ల్లో రిటైర్ మెంట్ ఇచ్చే చివరి సంవత్సరాలలో సక్సెస్ అయిన ముగ్గురు బౌలర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
3.క్రిస్ కేయిర్న్స్
న్యూజిలాండ్ కు చెందిన ఈ దిగ్గజ ఆల్ రౌండర్ ప్లేయర్ బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా బౌలింగ్ తో కూడా తనదైన రీతిలో వికెట్లు తీసి జస్ట్ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ తరపున తనకంటూ ఒక సపరేట్ హిస్టరీని క్రియేట్ చేసుకున్నాడు… క్రిస్ 1988 చివరి సంవత్సరాల లో క్రికెట్ టీం లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఒక పది సంవత్సరాల పాటు ఆయన ప్రతిభ అనేది బయటికి అయితే కనిపించలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఎంటైర్ టెస్ట్ కెరియర్ లో మొత్తం 218 వికెట్లు తీశాడు. ఇక అందులో చివరి 28 మ్యాచ్ ల్లో 115 వికెట్లు తీశాడు. అలాగే 2004వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన క్రిస్ 2006వ సంవత్సరంలో అన్ని ఫార్మాట్ లలో నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు…
2.జవగల్ శ్రీనాథ్
ఇండియన్ టీం తరుపున చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించిన జవగల్ శ్రీనాథ్ స్వింగ్ బంతితో మ్యాజిక్ చేయగల బౌలర్ అనే చెప్పాలి. ఇండియన్ టీం లో ఇప్పటివరకు ఉన్న ఫాస్ట్ బౌలర్లందరిలో టాప్ 10 లో శ్రీనాథ్ తప్పకుండా చోటు సంపాదించుకుంటాడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మొత్తం 67 మ్యాచ్ ల్లో 238 వికెట్లు తీశాడు. చివరి 33 మ్యాచ్ ల్లో 118 వికెట్లు తీశాడు. అలాగే తను అత్యుత్తమమైన బౌలింగ్ చేస్తూ ఒక మ్యాచ్ లో 132 పరుగులు ఇచ్చి 13 వికెట్లను కూడా పడగొట్టాడు… 2002వ సంవత్సరంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన శ్రీనాథ్ 2003 వ సంవత్సరంలో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్లకు రిటర్మెంట్ ను ప్రకటించాడు…
1.మిచెల్ జాన్సన్
ప్రత్యేకమైన బౌలింగ్ వేస్తూ ఆస్ట్రేలియా టీం కి ఎన్నో అరుదైన విజయాలను అందించిన మిచెల్ జాన్సన్ బౌలర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక 2012 నుంచి 2015 మధ్యకాలంలో ఆయన 26 మ్యాచుల్లోనే 123 వికెట్లు తీసి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఇక ఆస్ట్రేలియా టీమ్ లో ఎవరికి సాధ్యం కాని భారీ రికార్డ్ లను కూడా తను సొంతం చేసుకున్నాడు…