Sandeep Sharma: ఐపీఎల్ సేజన్ 16 లో కుర్రాళ్ళు కుమ్మేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. యువ బ్యాట్స్ మెన్స్ ను చూసి సీనియర్ ఆటగాళ్లు.. అమ్మో వాళ్లలా బ్యాటింగ్ చేయడం మాతో కాదు అంటున్నారు. ఇక యువ బౌలర్ల బంతులు ఎదుర్కొనడానికి కూడా హేమా హామీ బ్యాట్స్ మెన్స్ తడబడుతున్నాయి.
సీనియర్లకు చెమటలు..
మోస్ట్ డేంజరస్ బ్యాటర్లలో ధోనీ ఒకడు.. లాస్ట్ ఓవర్‌లో ధోనీని మించిన ఆటగాడు లేడు.. అయితే ధోనీతోపాటు కోహ్లీ, రోహిత్ కు కూడా చెక్ పెట్టిన బౌలర్ ఉన్నాడు. సీనియర్లు.. అసలు అతని బౌలింగ్‌లోనే ఆడలేపోతున్నారు.
తడబడుతున్న మ్యాచ్ విన్నర్లు
ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురు మ్యాచ్ విన్నర్లు.. ఐపీఎల్‌లో తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్యాటర్లు.. బౌలర్ల ఎవరైనా లెక్క చేయని మేటి హిట్టర్లు సందీప్ శర్మ బౌలింగ్ లో తడబడుతున్నారు. ఎందుకు అంటే.. అందరూ హ్యాండ్‌తో బౌలింగ్ వేస్తే సందీప్ బ్రెయిన్‌తో వేస్తాడు.. అందుకే ఎంతటి మేటి బ్యాటర్లైనా అతని బౌలింగ్‌లో బోల్తా పడతున్నారు.
బ్యాట్ పారేసుకున్న రోహిత్..
తాజాగా ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సందీప్ శర్మ నకెల్ బాల్‌కు వికెట్ పారేసుకున్నాడు.. రోహిత్ శర్మ కూడా దాదాపు అంతే.. సందీప్ శర్మ, రోహిత్ శర్మ మొత్తం 12సార్లు తడపడ్డారు.. అందులో 5సార్లు సందీప్ శర్మకే రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు..
14 మ్యాచ్ లలో కోహ్లీకి బౌలింగ్..
స్టార్ క్రికెటర్ కోహ్లీ కూడా సందీప్ శర్మ బౌలింగ్‌కి తీవ్రంగా ఇబ్బంది పడ్డవాడే.. కోహ్లీ, సందీప్‌శర్మ 14 మ్యాచ్‌ల్లో తలపడ్డారు.. అందులో ఏడుసార్లు కోహ్లీ వికెట్‌ను సందీప్‌శర్మ తీశాడంటే నమ్మగలరా.. చెప్పాలంటే సందీప్ శర్మ ఫెవరెట్ బన్నీ కోహ్లీనే.. అతని బౌలింగ్‌లో కోహ్లీ యావరేజ్ 11గా ఉంది. కేవలం ఒక్కటంటే ఒక్క సిక్స్ మాత్రమే కోహ్లీ అతని బౌలింగ్‌లో కొట్టాడు.
ధోనీకి తప్పని తడబాటు..
బౌలర్ సందీప్ శర్మపై ధోనీకి కూడా అంత గొప్ప రికార్డులేమీ లేవు.. అయితే కోహ్లీ, రోహిత్ లాగా ధోనీ వికెట్ సమర్పించుకోలేదు.. అయితే ఈ సీజన్‌లో రాజస్థాన్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో సందీప్ శర్మ బౌలింగ్‌కు ప్రశంసలు దక్కాయి.. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 21పరుగులు కావాలి.. ధోనీ వీర బాదుడుతో ఆ లెక్క 3బంతుల్లో 7కు వచ్చింది. ఇక విజయం లాంఛనమేనని సీఎస్‌కే ఫ్యాన్స్ ఫిక్స్ ఐపోయారు..ఓక వైడ్ తర్వాత లయ కోల్పోయిన సందీప్ ఆ తర్వాత పుంజుకున్నాడు.. యార్కర్ లెంగ్త్ బౌలింగ్‌తో ధోనీని కట్టడి చేశాడు.. ఆ మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు.
మొత్తంగా ఈ సీజన్ లో రాజస్థాన్ తరపున ఆడుతున్న సందీప్ శర్మ తన బౌలింగ్ తో సీనియర్లకు చెమటలు పట్టిస్తూ సెలక్టర్లు దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్ తర్వాత వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. చూస్తుంటే సందీప్ శర్మ ఛాన్స్ కొట్టేసెలా కనిపిస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ సందీప్!