India Vs Australia World Cup 2023: ప్రపంచ కప్ ఆడడానికి ముందు ఇండియన్ టీం లో కొన్ని వందల ప్రశ్నలు,కొన్ని వేల సందేహాలు ఇండియన్ టీం ఎలా ఆడుతుంది.మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా లేదు, ఓపెనర్లు బలంగా ఆడడం లేదు, బౌలర్లలో దమ్ము లేదు పెస్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు అంటూ ప్రపంచం లోని ప్రతి ఒక్కరు విపరీతమైన కామెంట్లు చేశారు. మన మాజీ ప్లేయర్లు కూడా ఇండియన్ టీం పైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అసలు మన టీం లీగ్ దశలో నుంచే నిష్క్రమిస్తుందా అనేంత రేంజ్ లో కామెంట్స్ అయితే చేశారు. కానీ వాటన్నింటికీ సమాధానం చెబుతూ రోహిత్ సేన తనదైన రీతిలో ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క స్ట్రాటజీతో గెలుస్తూ ముందుకు కదులుతూ ఇప్పటి వరకు ఎవ్వరు సాధించని విధంగా ఈ టోర్నీలో వరుసగా పది విజయాలను అందుకుని విమర్శించిన ప్రతి నోరు మూసుకునేలా సమాధానం చెప్పారు.ఇక కప్పు కి ఒక్క అడుగు దూరం లో ఫైనల్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైన ఈ ఇండియన్ టీమ్ ఈ ఒక్క మ్యాచ్ లో గెలిచి ఇండియన్ టీం కి 12 సంవత్సరాల తర్వాత మరోసారి వరల్డ్ కప్ ని అందించాలని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా టీం తో ఆడబోయే ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం విజయం సాధించాలంటే ఆషామాషి కాదు అని మరికొంత మంది అంటున్నారు.
కానీ ఇంతకు ముందు కూడా ఆషామాషీ కాదు అన్న ప్రతి మ్యాచ్ ని ఇండియన్ టీం గెలిచి చూపించింది. ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ ఉన్న ఫామ్ ని బట్టి ఆస్ట్రేలియా ని ఓడించడం పెద్ద లెక్క అయితే కాదు, ఇక అదే స్ట్రాటజీతో ముందుకు కదులుతున్న రోహిత్ సేన ఇప్పుడు కూడా అంతే ధీమాతో అంతే ధైర్యంతో
ఒక ఉప్పెనల విరుచుకుపడి ఆస్ట్రేలియాని చిత్తు చేయాలని చూస్తుంది… ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీదనే ఆసక్తికరమైన చర్చలు వ్యక్తమవుతుంటే చాలామంది గెలుపు విషయం లో ఇండియన్ టీం కే ఎక్కువ మెజారిటీని అందిస్తున్నారు. ఎందుకంటే ఇండియా ఇంతకు ముందు మ్యాచ్ ల్లో కనబరిచిన పర్ఫామెన్స్ అలాంటిది…
అయితే ఇండియన్ టీమ్ ఇవాళ్ల ఫైనల్ మ్యాచ్ లో గెలవాలి అంటే టాస్ కీలకంగా మారబోతుంది అనే విషయం మరొక సారి స్పష్టంగా కనిపిస్తుంది…ఈ గ్రౌండ్ లో జరిగిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లో మూడుసార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమ్ లే గెలిచాయి, ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ చేసింగ్ లోనే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది. అయితే మరికొందరు మాత్రం ఫైనల్ మ్యాచ్ కాబట్టి మొదట బౌలింగ్ తీసుకుంటే చేజింగ్ చేసేటప్పుడు బ్యాట్స్ మెన్స్ కి ప్రెజర్ అయితే ఉంటుంది. కాబట్టి టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది అనేది బాగా ఆలోచించి తీసుకోవడం బెటర్ అని సలహాలు ఇస్తున్నారు…
ఇక ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదటి నుంచి కూడా ఇండియన్ టీమ్ లో కీలక పాత్ర వహిస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ , శ్రేయస్ అయ్యర్, కే ఎల్ రాహుల్ , మహమ్మద్ షమీ అందరూ కూడా ఈ ఫైనల్లో తమదైన రీతిలో రాణించి ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాలి లేకపోతే ఆస్ట్రేలియా ఇండియన్ టీం పైన ఆధిపత్యం చూపించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ప్రపంచం మొత్తం ఇండియాని ప్రశంసల వర్షంతో కురిపిస్తుంది.కాబట్టి ఒక విషయాన్ని మైండ్ లో ఉంచుకొని ప్లేయర్లు క్రికెట్ ఆడితే బాగుంటుందని పలువురు మాజీ ప్లేయర్లు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…