IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు వెళ్లిన నేపథ్యంలో సిరీస్ లో 1-1తో ఉంది. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమితో అభిమానులను నిరుత్సాహపరచింది. భారత్ విజయం కోసం మూడో టెస్టు కోసం వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. కేప్ టౌన్ వేదికా ఈనెల 11 నుంచి జరగనున్న మూడో టెస్టులో విజయం సాధించాలని అభిమానులు అభిలషిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టెస్ట్ ల్లో సిరీస్ విజయం కలగానే మిగిలిపోయిన సందర్భంలో ఈసారైనా విజయదుందుభి మోగించాలని కోరుకుంటున్నారు.
టీమిండియా ప్రదర్శనపై విజయం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. మూడో టెస్ట్ ను విజయంతో ముగించి అభిమానుల కోరిక తీర్చాలని కసరత్తు చేస్తోంది. ఇండియా కోరికకు అడ్డు తగలాలని దక్షిణాఫ్రికా కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయంపై కన్నేసినా అది నెరవేరడానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. మూడో టెస్ట్ లో గెలిస్తే ఇండియా చిరకాల వాంఛ నెరవేరుతుంది. కానీ అది ఇంకా తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Also Read: ఐపీఎల్ 2022 గురించి మరో గుడ్ న్యూస్
1992 నుంచి 2018 వరకు కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఒక్కసారి కూడా విజయం సాధించలేదని తెలుస్తోంది. రెండు మ్యాచులను డ్రా చేసుకున్నా మూడింట్లో మాత్రం ఓటమి పాలైంది. దీంతో కేప్ టౌైన్ లో భారత్ ఆశలు నెరవేరుతాయో లేదో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేప్ టౌన్ లో ఆడే టెస్టులో టీమిండియా ప్రదర్శనపై అభిమానుల్లో ఆశలు భారీగానే ఉన్నా అది నెరవేరేందుకు ఇంకా సమయం పడుతుందో ఏమో అనే సంశయాలు వస్తున్నాయి.
రికార్డుల పరంగా చూస్తే కేప్ టౌన్ లో భారత్ గెలిచిన దాఖలాలు లేకపోవడంతో అభిమానుల కోరిక తీరేందుకు ఇంకా వేచి ఉండాలా? లేక ఇక్కడే తీరుతుందా? అనే అనుమానాలు అందరిలో వస్తన్నాయి. కానీ టీమిండియా పటిష్ట స్థితిలోనే ఉందని ఎలాగైనా ఇక్కడే విజయం సాధించి అభిమానుల చిరకాల వాంఛ నిలబెట్టుకోవాలని చూస్తోంది. మొత్తానికి కేప్ టౌన్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుస్తోంది. టీమిండియా జట్టులో మార్పులు అనివార్యమనే వాదన వస్తోంది. దీంతో బీసీసీఐ ఏం చర్యలు తీసుకుంటుందో ఎదురు చూడాల్సిందే.
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సఫారీల గడ్డపై టీమిండియా చారిత్రక విజయం