Homeక్రీడలుOdi World Cup 2023: వన్డే వరల్డ్ కప్ వేదికలపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Odi World Cup 2023: వన్డే వరల్డ్ కప్ వేదికలపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Odi World Cup 2023: భారత్ లో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించేందుకు అనుగుణంగా షెడ్యూల్ రెండు రోజుల కిందట విడుదలైంది. అయితే షెడ్యూల్ విడుదలైన తర్వాత మ్యాచ్లు నిర్వహించే వేదికల పట్ల విమర్శలు ఎక్కువవుతున్నాయి. కొన్ని స్టేడియాలకు కావాలనే ముఖ్యమైన మ్యాచ్లను కేటాయించలేదని, గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో గల ప్రధాన నరేంద్ర మోడీ స్టేడియానికి కీలకమైన మ్యాచులు నిర్వహించే అవకాశాన్ని కల్పించడం వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వన్డే ప్రపంచ కప్ భారత్లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్లు నిర్వహించే వేదికల పట్ల కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. కీలకమైన మ్యాచులను కావాలనే ఒకే స్టేడియంలో నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు తాజాగా స్పందించారు. ఎటువంటి వివక్షకు తావు లేకుండా వేదికలు నిర్ణయించామని రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. వేదికలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న రగడ బీసీసీ దృష్టికి కూడా వెళ్లినట్లు స్పష్టమైంది.

తీవ్ర ఆరోపణలు చేసిన పంజాబ్ క్రీడల మంత్రి..

వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి కేటాయించిన స్టేడియాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. వరల్డ్ కప్ షెడ్యూల్లో మొహాలీకి చోటు కల్పించకపోవడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు బీసీసీఐ 12 వేదికలను ఎంపిక చేసింది. ఇందులో రెండిట్లో వార్మప్ మ్యాచ్లను నిర్వహిస్తారు. మిగతా 100 వేదికల్లో ప్రపంచ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. వేదికల విషయంలో వస్తున్న విమర్శలను బిసిసిఐ ఉపాధ్యక్షుడు తాజాగా కొట్టిపారేశారు.

ఐసీసీ స్టాండర్డ్స్ కు అనుగుణంగా లేకపోవడం వల్లే అన్న ఉపాధ్యక్షుడు..

ఐసీసీ స్టాండర్డ్స్ కు మొహాలీ వేదిక సరితూగలేదని, తమ చేతుల్లో ఎలాంటి నిర్ణయం ఉండబోదని ఈ సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 12 వేదికలలో వార్మప్ సహా ప్రపంచకప్ మ్యాచ్లు కోసం సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ప్రపంచ కప్ కోసం తొలిసారి 12 వేదికలను ఎంపిక చేసామని, ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్ ల కోసం ఎంపిక కాలేదని వివరించారు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గౌహతి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. మిగతావన్నీ లీగ్ లు, నాకౌట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయని, మరిన్ని వస్తువులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్నించి రెండు వేడుకలను ఎంపిక చేసినట్లు రాజీవ్ శుక్లా వివరించారు. అదే విధంగా ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచులు జరుగుతాయని స్పష్టం చేశారు. మ్యాచ్లను కేటాయించడంపై ఏ వేదిక పైన వివక్షత చూపించలేదని, ద్వైపాక్షిక శిరీష మ్యాచ్లను మోహాలి వేదికగానే నిర్వహించామని వెల్లడించారు. వరల్డ్ కప్ కోసం మైదానాలు ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకమని, తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అందులోనూ ఎన్నో చర్చల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈసారి చాలా స్టేడియాలు కొత్తగా ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయాన్ని రాజీవ్ శుక్ల బయటపెట్టారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు తాజా వివరణ తర్వాత అయినా వేదికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం, విమర్శలు ఆగుతాయేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular