Hardik Pandya: ఐపీఎల్ లో ఇప్పటివరకు ఐదు సార్లు టైటిల్ గెల్చుకున్న మొదటి టీమ్ గా ముంబై ఇండియన్స్ టీమ్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ముంబై టీమ్ ఈ సీజన్ కోసం రోహిత్ శర్మ ను కెప్టెన్ గా తప్పించి అతని స్థానం లో హార్థిక్ పాండ్యా కి బాధ్యతలను అప్పగించింది. పాండ్య గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్ టీమ్ లో ఉన్నప్పటికీ ట్రేడింగ్ విధానం ద్వారా ముంబై టీమ్ అతన్ని తీసుకొని 2024 లో జరిగే ఐపిఎల్ కోసం అతన్ని కెప్టెన్ గా కూడా చేసింది.
అయితే అప్పటినుంచి ముంబై ఇండియన్స్ టీమ్ పైన అభిమానుల్లో విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. ఇక దానికి తగ్గట్టుగానే చాలామంది ముంబై ఇండియన్స్ టీమ్ ను వ్యతిరేకిస్తూ వస్తూన్నారు. రోహిత్ శర్మని తప్పించి హార్దిక పాండ్య ను కెప్టెన్ చేయడం పట్ల చాలామంది ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు కూడా విమర్శనాత్మకమైన కామెంట్స్ అయితే చేశారు.అయితే ఇప్పుడు ఆ విషయం మీద ఆ టీమ్ కోచ్ అయిన మార్క్ బౌచర్ స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ని తప్పించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేయడం పట్ల వ్యక్తిగతమైన కారణాలు ఏమీ లేవు’ కానీ, రోహిత్ శర్మ చాలా రోజుల నుంచి ప్లేయర్ గా సక్సెస్ కాలేకపోతున్నాడు.
గత రెండు సీజన్లలో కూడా తను పెద్దగా పరుగులు చేసింది లేదు. దాంతో తన మీద ప్రెజర్ ని తగ్గించడం కోసమే కెప్టెన్ గా తనకి రెస్ట్ ఇచ్చాం అని చెబుతూనే దీనివల్ల రోహిత్ శర్మ కూడా మంచి పర్ఫామెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని దశల్లో కెప్టెన్సీ మారడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే ముంబై టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇది అర్థం కాక చాలా మంది ముంబై యాజమాన్యాన్ని విమర్శిస్తున్నారు…కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చాడు. కానీ ప్లేయర్ గా మాత్రం సక్సెస్ కావడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి లో ఆయనకి కొంచెం విశ్రాంతి కల్పించాలనే ఉద్దేశ్యం తోనే అలా చేశాము.ఇక ఇది అర్థం కాక చాలామంది అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. నిజానికి ఒక ప్లేయర్ ఆట తీరు కి, భావోద్వేగానికి సంబంధం లేకుండా ఆలోచించాలి.
అలాంటప్పుడే టీమ్ కి మంచి జరుగుతుంది అంటూ కెప్టెన్సీ మార్పు పైన బౌచర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు… ఇక ఇదిలా ఉంటే బౌచర్ మాటలపైన రోహిత్ శర్మ సతీమణి అయిన రితిక విమర్శనాత్మకంగా పోస్ట్ చేశారు. ‘దీనివల్లే చాలా తప్పిదాలు జరిగాయి’ అంటూ ఆమె పేర్కొనడం ఇప్పుడు భారీ చర్చకు దారితీసింది. ఇక మొత్తానికైతే మార్చిలో ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక ఈ సీజన్ లో ఏ టీమ్ తమ సత్తా చాటుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…