Lucknow Super Giants: ఇంకో రెండు నెలల్లో ఐపిఎల్ స్టార్ట్ అవుతుంది ఇక ఇప్పటికే అన్ని టీములు కూడా మ్యాచ్ లు ఆడటానికి సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా కప్పు గెలవడమే లక్ష్యం గా పెట్టుకొని బరిలోకి దిగబోతున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ లో అన్ని టీములు కూడా ఇప్పటికే వాళ్ల టీం తరఫున ఏ ప్లేయర్లను బరిలోకి దింపాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 2022 వ సంవత్సరం లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జాయింట్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది.అయినప్పటికీ లక్నో టీం రెండుసార్లు సెమీఫైనల్ కి వచ్చి ఓడిపోయింది. అయితే ఈ టీమ్ కి కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఇంతకుముందు ఈ టీం కి మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ వ్యవహరించాడు అయితే రెండు సీజన్ లలో కూడా ఈ టీమ్ సెమీ ఫైనల్ కి వచ్చి ఓడిపోవడంతో ఈ సీజన్ లో గంభీర్ ని మెంట్ గా తొలగించారు. దాంతో ఆయన కలకత్తా టీం కి వెళ్లిపోయాడు అయితే ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ యాజమాన్యం నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే కే ఎల్ రాహుల్ ని కూడా కెప్టెన్ గా తప్పించి అతని ప్లేస్ లో వేరే కొత్త కెప్టెన్ ని పెట్టాలనే ఆలోచనలో టీమ్ యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే కేఎల్ రాహుల్ టీమ్ ని ముందు ఉండి నడిపించినప్పటికీ నాకౌట్ మ్యాచ్ లలో ఆయన తీసుకునే డేసిజన్స్ అనేవి అంతా ఎఫెక్టివ్ గా ఉండడం లేదు అందువల్లే లక్నో టీమ్ సెమీఫైనల్ లోకి వెళ్లి ఓడిపోతుందంటూ టీం యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ లో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కే ఎల్ రాహుల్ ని మించిన కెప్టెన్ అందులో ఎవరున్నారు అనేది ఇప్పుడు అందరిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.. ఇక మరి కే ఎల్ రాహుల్ ని పక్కన పెట్టి వేరే ఇంకో ప్లేయర్ ని కెప్టెన్ గా చేస్తారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే టీం యాజమాన్యం భావిస్తున్న దాని ప్రకారం ఈ ఒక్క సీజన్ కి ఛాన్స్ ఇచ్చి ఈ సీజన్ లో కనక కప్పు కొట్టకపోతే మాత్రం నెక్స్ట్ సీజన్ నుంచి వేరే కెప్టెన్ ని నియమించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
అయితే ఇంతకుముందు పంజాబ్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించాడు. అక్కడ కూడా పెద్దగా ఎఫెక్టివ్ డెసిజన్స్ ఏమి తీసుకోకపోవడం వల్ల పంజాబ్ టీం కి కూడా కప్పు తీసుకొచ్చి పెట్టలేకపోయాడు. దానివల్లే ఆయన మీద ఇప్పుడు భారీ ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈసారి తనని తాను ప్రూవ్ చేసుకొని టీమ్ కి కప్పు అందించకపోతే మాత్రం తన కెప్టెన్సీ పై వేటు పడే ప్రమాదం అయితే ఉంది…