Naa Saami Ranga Twitter Review: నా సామిరంగ ట్విట్టర్ రివ్యూ: నాగార్జున మాస్ జాతర, ఓవరాల్ టాక్ ఇదే!

ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక రోల్స్ చేస్తుండగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. జనవరి 14న ఈ మూవీ విడుదలైంది.

Written By: NARESH, Updated On : January 14, 2024 8:56 am

Naa Saami Ranga Twitter Review

Follow us on

Naa Saami Ranga Twitter Review: సంక్రాంతి బరిలో చివరి చిత్రంగా విడుదలైంది నా సామిరంగ. నాగార్జున ఈసారి సంక్రాంతికి రీమేక్ తో వస్తున్నాడు. నా సామిరంగ పోరింజు మరియం జోసే అనే మలయాళ చిత్ర రీమేక్. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు భారీగా మార్పులు చేశారు. నాగార్జున కిష్టయ్యగా ఊరమాస్ రోల్ చేశారు. నా సామిరంగ పక్కా సంక్రాంతి మూవీ అని చెబుతున్న విషయం తెలిసిందే. విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో నా సామిరంగ తెరకెక్కింది.

ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక రోల్స్ చేస్తుండగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. జనవరి 14న ఈ మూవీ విడుదలైంది. కాగా నా సామిరంగ ప్రీమియర్స్ ప్రదర్శన ఆలస్యంగా జరిగింది. యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా షోలు పడలేదు. దాంతో సోషల్ మీడియా టాక్ లేటుగా వచ్చింది. కాసేపటి క్రితమే షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది.

నా సామిరంగ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. కథలో మాస్ ఎలిమిమెంట్స్ తో పాటు లవ్, ఎమోషన్ ప్రధానంగా ఉన్నాయి అంటున్నారు. నాగార్జున కిష్టయ్య పాత్రలో మెస్మరైజ్ చేశాడు. బంగార్రాజు అనంతరం ఆ తరహా పాత్రలో మెప్పించాడు. నాగార్జున క్యారెక్టరైజేషన్ హైలెట్ అంటున్నారు. హీరోయిన్ ఆషిక రంగనాథ్ పాత్రకు చాలా వెయిట్ ఉందట. కథలో కీలకమైన పాత్ర చేసిన ఆషిక మెప్పించింది అంటున్నారు.

అల్లరి నరేష్ పాత్ర సినిమాకు మరో హైలెట్ అంటున్నారు. రాజ్ తరుణ్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడని అంటున్నారు. దర్శకుడు విజయ్ బిన్నీ అన్ని అంశాలు కలగలిపి పక్కా సంక్రాంతి సినిమా తెరకెక్కించారు అంటున్నారు. కీరవాణి బీజీఎం, సాంగ్స్ బాగున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా నా సామిరంగ సంక్రాంతికి చూడాల్సిన సినిమా అంటున్నారు.