IPL 2024 : ఐపీఎల్ 2024లో బెస్ట్ పెర్ఫామెన్స్ వీరిదే.. ఎవరికి ఎంత దక్కిందంటే?

IPL 2024 అత్యంత విలువైన ఆటగాడిగా, ఐపీఎల్‌ – 2024 సీజన్‌ ఆల్‌రౌండర్‌గా బీసీసీఐ సునీల్‌ నరైన్‌ను ప్రకటించింది. ఇతనికి కూడా రూ.10 లక్షల ప్రైజ్‌మని చెల్లించారు.

Written By: NARESH, Updated On : May 27, 2024 8:47 pm

best performance

Follow us on

IPL 2024 : IPL 2024 ఫైనల్‌ మ్యాచ్‌ విజేత కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్రైజ్‌ మనీగా రూ. 20 కోట్లు అందుకుంది. ఆదివారం(మే 26న) జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌( (SRH)ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR) 8 వికెట్ల తేడాతో ఓ డించింది. ఐసీఎస్‌ సీజన్‌–17 విజేతగా నిలిచింది.

ప్రైజ్‌మనీ ఇలా..
ఐపీఎల్‌–2024 ప్రైజ్‌ మనీని బీసీసీ ఇప్పటికే ప్రకటించింది. 2024 ఛాంపియన్‌లకు 46.5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిప్రకారం కేకేఆర్‌కు ప్రైజ్‌ మనీగా రూ.20 కోట్లు అందుకుంది. రన్నరప్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ.13 కోట్లు అందుకుంది.

ఉత్తమ ఆటగాళ్లు వీరే..
ఐపీఎల్‌ – 2024లో ఉత్తమ ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ కోహ్లీ ఆరంజ్‌ క్యాప్, ఉత్తమ బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నారు. ఆల్‌రౌండర్‌గా నరైన్, బెస్ట్‌ కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ను ఎంపిక చేసింది.

కోహ్లికి ఆరెంజ్‌ క్యాప్‌..
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు క్రికెట్, కింగ్‌ కోహ్లీ ఐపీఎల్‌ – 2024లో పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నారు. టోర్నీలో అత్యధికంగా 741 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా రూ.10 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు.

హర్షల్‌ పటేల్‌కు పర్పుల్‌ క్యాప్‌..
ఇక ఐపీఎల్‌ సీజన్‌ 17లో బెస్ట్‌ బౌలర్‌గా పంజాబ్‌ కింగ్స్‌కు చెందిన హర్షల్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. ఎకానమీ పరంగా జస్ప్రిత్‌ బూమ్రా ముందు ఉన్నప్పటికీ వికెట్ల పరంగా హర్షల్‌ పటేల్‌ 24 వికెట్లతో బూమ్రాను వెనక్కి నెట్టారు. పర్పుల్‌ క్యాప్‌ విజేతగా పటేల్‌ రూ.10 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు.

ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా నితీశ్‌..
ఇక ఈ ఐపీఎల్‌లో ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది ఇయర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు తెలుగు ప్లేయర్‌ నితీష్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యాడు. ఇతనికి కూడా రూ.10 లక్షల ప్రైజ్‌ మనీ అందింది.

ఆల్‌రౌండర్‌గా నరైన్‌..
అత్యంత విలువైన ఆటగాడిగా, ఐపీఎల్‌ – 2024 సీజన్‌ ఆల్‌రౌండర్‌గా బీసీసీఐ సునీల్‌ నరైన్‌ను ప్రకటించింది. ఇతనికి కూడా రూ.10 లక్షల ప్రైజ్‌మని చెల్లించారు.

బెస్ట్‌ కెప్టెన్‌గా కమిన్స్‌..
ఇక నామమాత్రంగా ఐపీఎస్‌ సీజన్‌ –17 ప్రారంభించిన ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆ జట్టు సారధిగా ప్యాట్‌ కమిన్స్‌ ముందుండి నడిపించారు. కీలక మ్యాచ్‌లలో జట్టును సమస్టిగా గెలిపిస్తూ.. ఐపీఎల్‌ ఫైనల్‌కు చేర్చాడు. దీంతో ఉత్తమ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.