Kirak RP : ఎన్నికల ఫలితాల తర్వాత జరిగేది ఇదే… జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్

కానీ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానిపై రెండు పార్టీల్లోనూ ఆందోళన ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

Written By: NARESH, Updated On : May 27, 2024 6:58 pm
Follow us on

Kirak RP : జబర్దస్త్ మాజీ కమెడియన్ కిరాక్ ఆర్పీ 2024 ఏపీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. జనసేన పార్టీ తరుపున ప్రచారం చేస్తూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ కిరాక్ ఆర్పీ ఘాటైన పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలపై నిర్వహిస్తున్న పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా కూటమి గెలుపు పక్కా అంటూ జోస్యం చెబుతున్నాడు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ మాట్లాడుతూ .. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయమన్నాడు. కూటమి గెలుపు పక్కా అని కిరాక్ ఆర్పీ అభిప్రాయ పడ్డాడు. అంతేకాదు లండన్ పర్యటనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక కిరాక్ ఆర్పీ తీరుపై వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. జూన్ 4న ఎవరి సత్తా ఏంటో చూద్దాం అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. రిజల్ట్స్ తర్వాత నువ్వు అసలు కనిపిస్తావా, తేడా కొడితే ఏపీలో నీ షాప్ ఒక్కటి కూడా ఉండదు అంటూ ఇచ్చిపడేస్తున్నారు. నువ్వు చెప్పినట్టు 145 సీట్లు రాకపోతే నీ పరిస్థితి ఏంటి అని ఆర్పీ ని ట్రోల్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే .. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు గెలుస్తామని ఒక వైపు ఎన్డీయే కూటమి, మరోవైపు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానిపై రెండు పార్టీల్లోనూ ఆందోళన ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.