ఆస్ట్రేలియాలో టీమిండియా అలా గెలిచిందట!

ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు.. సొంత దేశంలో బలమైన ఆస్ట్రేలియా.. సీనియర్లు ఎవరూ లేని కుర్ర టీమిండియా చేతిలో గత డిసెంబర్ లో జరిగిన టెస్టు సిరీస్ లో ఓడిన సంగతి తెలిసిందే. కోహ్లీ సహా సీనియర్లు అంతా గాయలతో దూరమైతే సెకండ్ బెంచ్ ఆటగాళ్లతోనే ఆడిన ఇండియా.. ఏకంగా ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 2-1తో ఓడించి సత్తా చాటింది. చరిత్రలోనే గొప్ప టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించారు. అయితే ఈ విజయాన్ని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ […]

Written By: NARESH, Updated On : May 13, 2021 4:12 pm
Follow us on

ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు.. సొంత దేశంలో బలమైన ఆస్ట్రేలియా.. సీనియర్లు ఎవరూ లేని కుర్ర టీమిండియా చేతిలో గత డిసెంబర్ లో జరిగిన టెస్టు సిరీస్ లో ఓడిన సంగతి తెలిసిందే. కోహ్లీ సహా సీనియర్లు అంతా గాయలతో దూరమైతే సెకండ్ బెంచ్ ఆటగాళ్లతోనే ఆడిన ఇండియా.. ఏకంగా ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 2-1తో ఓడించి సత్తా చాటింది. చరిత్రలోనే గొప్ప టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించారు.

అయితే ఈ విజయాన్ని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ మాత్రం అంగీకరించడం లేదు. టీమిండియా తమ దృష్టి మళ్లించడంతోనే తాము టెస్ట్ సిరీస్ లో ఓడిపోయామని ఆరోపిస్తున్నాడు. పక్కదారి పట్టించి ఇండియా గెలిచిందని ఆడిపోసుకుంటున్నాడు.

ఈ సిరీస్ లోనే అనుభవం లేకున్నా కూడా శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ లు బాగా రాణించి ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.

అయితే టీమిండియా గబ్బాకు వెళ్లమని చెప్పి మొండికేసందని.. దానివల్లే తమ ఏకాగ్రత బంతి కాకుండా.. మ్యాచ్ జరుగుతుందో లేదోనన్న దానిపై మళ్లిందని.. పక్కదారి పట్టించే ఈ పనుల వల్లే టీమిండియా గెలిచిందని టీమ్ పైన్ ఆరోపించారు.

అయితే ప్రతిసారి ప్రత్యర్థిని ఇలా పక్కదారి పట్టించే ఆస్ట్రేలియా గెలుస్తుంటుంది. స్లెడ్జింగ్ చేస్తూ ..ఓడిపోతారని ముందే పత్రికలు, మీడియాలో హోరెత్తించి స్తైర్యం దెబ్బతీస్తుంది. అయితే టీమిండియా రివర్స్ అటాక్ తో ఇప్పుడు టిమ్ పైన్ ఈ వితండవాదాన్ని తెరపైకి తెచ్చాడని అంటున్నారు.