Kuldeep Yadav: కులదీప్ వికెట్లు తీసేందుకు ప్రధాన కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన కేఎల్ రాహుల్

రాహుల్ ఇంతటితో ఆగకుండా ఒకప్పుడు ధోని పాత్రను పోషిస్తున్నాడు. వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సూచనలు ఇస్తున్నాడు. ఒకప్పుడు ధోని వికెట్ కీపర్ గా ఉన్నప్పుడు కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఒక వెలుగు వెలిగారు.

Written By: Bhaskar, Updated On : September 13, 2023 9:46 am

Kuldeep Yadav

Follow us on

Kuldeep Yadav: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై విజయం సాధించి దర్జాగా ఫైనల్ లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. శ్రీలంక ఆటగాళ్ళను వారి సొంత మైదానం లోనే కట్టడి చేశారు. అయితే భారత్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ జట్టు విజయాల్లో కుల దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. అయితే అతడు ఈ స్థాయిలో రాణించడం వెనుక కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ కూడా ఈ టోర్నీలో విజయవంతంగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్ జట్టు జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశాడు. బ్యాటింగ్ కు ప్రతికూలంగా ఉన్న మైదానంపై ఇషాన్ కిషన్ తో కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్యాటింగ్ లో సత్తా చూపుతున్న కేఎల్ రాహుల్ కు టీం ఇండియా మేనేజ్మెంట్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా ప్రమోషన్ ఇచ్చింది. వికెట్ కీపర్ గానూ రాహుల్ దుమ్ము లేపుతున్నాడు. కళ్ళు చెదిరే విధంగా క్యాచ్ లతో పాటు సూపర్ స్టంపింగ్ లతో ఆకట్టుకుంటున్నాడు.

రాహుల్ ఇంతటితో ఆగకుండా ఒకప్పుడు ధోని పాత్రను పోషిస్తున్నాడు. వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సూచనలు ఇస్తున్నాడు. ఒకప్పుడు ధోని వికెట్ కీపర్ గా ఉన్నప్పుడు కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఒక వెలుగు వెలిగారు. క్రికెట్ల వెనుక ఉండి ధోని ప్రత్యర్థి బ్యాటర్ల కదలికలను గమనిస్తూ ఉండేవాడు. అలా వారికి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అతడు చెప్పిన విధంగా వారు బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టేవారు. ఇప్పుడు రాహుల్ కూడా అలానే చేస్తున్నాడు. బౌలర్లకు సలహాలు ఇస్తూ ఒకప్పటి ధోనిని తలపిస్తున్నాడు. రాహుల్ ఇచ్చిన సలహాలతో కులదీప్ యాదవ్ బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీస్తున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో కులదీప్ యాదవ్ రాహుల్ చెప్పిన విధంగా బౌలింగ్ చేశాడు. ఫలితంగా ఆ జట్టు ఆటగాడు సమర విక్రమార్క స్టంప్ ఔట్ అయ్యాడు. 18 వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ కు ముందు కులదీప్ యాదవ్ తో రాహుల్ చర్చించాడు. మూడో బంతికి
సమర విక్రమార్క స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక నాలుగోవి చెట్టు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.

ఆ తర్వాత రాహుల్ రవీంద్ర జడేజా కు కూడా పలు సూచనలు చేశాడు. నెమ్మదిగా బౌలింగ్ చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే జడేజా 3 బంతులను నెమ్మద్దిగా వేయడంతో శ్రీలంక బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బంతి వేగంగా వేయడంతో శ్రీలంక బ్యాట్స్మెన్ దానిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత రాహుల్ సూచనలు చాలా కీలకమని జడేజా భావించాడు. ఇలా ఇండియన్ బౌలర్లకు సూచనలు ఇస్తూ జట్టు విజయంలో రాహుల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పటి ధోని పాత్రను అతడు ఇప్పుడు భర్తీ చేస్తున్నాడు.