IND vs AUS Test series : మూడు టెస్టులు ముచ్చటగా మూడు రోజులే: బీసీసీఐ పై పేలుతున్న మీమ్స్‌

IND vs AUS Test series : యాషెస్‌ తర్వాత ఆ స్థాయిలో ఆసక్తి రేపేది బోర్డర్‌, గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌. గత రెండు టోర్నీలను భారత్‌ గెలుచుకుంది. ఈసారి ఆతిథ్యం భారత్‌ ఇచ్చింది. నాలుగు టెస్టుల సీరిస్‌లో భాగంగా భారత్‌ రెండు, ఆస్ట్రేలియా ఒకటి గెలుచుకున్నాయి. మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్‌ నాగ్‌ పూర్‌, ఢిల్లీలో భారత్‌ గెలిచింది. నాగ్‌ పూర్‌లో అయితే ఇన్నింగ్స్‌ తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత కొన్నేళ్లుగా ఇన్నింగ్స్‌ ఓటమి ఎరుగని […]

Written By: Bhaskar, Updated On : March 3, 2023 7:51 pm
Follow us on

IND vs AUS Test series : యాషెస్‌ తర్వాత ఆ స్థాయిలో ఆసక్తి రేపేది బోర్డర్‌, గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌. గత రెండు టోర్నీలను భారత్‌ గెలుచుకుంది. ఈసారి ఆతిథ్యం భారత్‌ ఇచ్చింది. నాలుగు టెస్టుల సీరిస్‌లో భాగంగా భారత్‌ రెండు, ఆస్ట్రేలియా ఒకటి గెలుచుకున్నాయి. మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్‌ నాగ్‌ పూర్‌, ఢిల్లీలో భారత్‌ గెలిచింది. నాగ్‌ పూర్‌లో అయితే ఇన్నింగ్స్‌ తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత కొన్నేళ్లుగా ఇన్నింగ్స్‌ ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను నేలకు దించింది. అంతే కాదు టెస్ట్‌ల్లో ఒకటో ర్యాంక్‌ జట్టుగా ఇండియాలోకి అడుగు పెట్టిన ఆస్ట్రేలియాను గింగిరాలు తిప్పారు. అయితే ఇండోర్‌లో మాత్రం భారత్‌కు చుక్కెదురయింది.

వికెట్లు నేలకూల్చారు

ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టులు మూడో రోజుల్లోనే ముగియడం గమనార్హం. నాగ్‌పూర్‌, ఢిల్లీ, ఇండర్‌ ఇలా మూడు వేదికల్లోనూ మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిశాయి. సాధారణంగా టోర్నీకి ముందు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్‌లు నమోదవుతాయని అందరూ భావించారు. కానీ వారి అంచనాలను మైదానాలు తలకిందులు చేశాయి. బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తారూ అనుకుంటే, బౌలర్లు వికెట్లను నేలకూల్చారు. ఇప్పటి వరకూ జరిగిన టెస్టుల్లో ఇండియా నుంచి అశ్విన్‌, రవీంద్రజడేజా, ఆస్ట్రేలియా నుంచి లయాన్‌, కునేమాన్‌, ముర్ఫీ భారీగా వికెట్లు నేలకూల్చి ఆయా జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు.

మూడు రోజులేనా?

సాధారణం టెస్టులు ఐదు రోజుల పాటు సాగుతాయి. అనూహ్య పరిస్థితుల్లోనే మూడు లేదా నాలుగు రోజుల్లో ముగుస్తాయి. కానీ ఇప్పటి వరకూ జరిగిన టెస్టులు మొత్తం మూడు రోజుల్లోనే ముగిశాయి. ఒక్క ఢిల్లీలోనే మధ్యాహ్నం వరకు సాగింది. మిగతా నాగ్‌పూర్‌, ఇండోర్‌లో అయితే తొలి సెషన్‌లోనే ముగిశాయి. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగియడంతో చివరి నాలుగు, ఐదు రోజుల్లో విక్రయించిన టిక్కెట్ల సొమ్మును తిరిగి ఇచ్చేశారు.

మైదానాల కూర్పు ఇలాగేనా

సాధారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మైదనాలు బౌన్సీగా ఉంటాయి. ఒక్కోసారి అవి కూడా బ్యాటర్లకు అనుకూలిస్తాయి. కానీ అదేం విచిత్రమో గానీ ఇండియాలో ఎన్నడూ లేవి విధంగా మైదానాలు బౌన్సీగా మారాయి. అంతే కాద ఉదయం పేసర్లకు, మధ్యాహ్నం నుంచి స్పిన్నర్లకు అనుకూలించడం మొదలు పెట్టాయి. తోపు తురం లాంటి బ్యాటర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టాయి. ‘డిఫెన్స్‌ ఆడుదామంటే ప్యాడ్లను తాకుతోంది. హుక్‌ చేద్దామంటే గాల్లోకి లేస్తోంది. స్లిప్‌లోకి ఆడుదామంటే వికెట్లను గిరాటేస్తోంది’ అంటూ బ్యాటర్లు వాపోతున్నారంటే మైదానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగుస్తుండటంతో అభిమానులు బీసీసీఐ పెదవి విరుస్తున్నారు. ‘మిగతా దేశాల్లో ఏమోగాని.. ఇండియాలో మాత్రం టెస్ట్‌ మ్యాచ్‌ల్లో నిడివిని మూడు రోజులకే పరిమితం చేశారంటూ’ బీసీసీఐపై అభిమానులు మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు.