India vs New Zealand 2nd Test: టీమిండియా విజయాల బాట పట్టింది. టీ 20 ప్రపంచ కప్ లో ఓటమి పాలైన ఇండియా పరువు నిలబెట్టుకునే క్రమంలో మళ్లీ విజయం సాధించడం హర్షించదగినదే. టీ 20 ప్రపంచకప్ లో ఫేవరేట్ గా బరిలో దిగినా పరాజయాల బాట పట్టి పరువు పోగొట్టుకుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని అన్నట్లు ఓటమి భారం నుంచి విజయాల బాట పట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని విజయదుందుబి మోగించింది. దీంతో పోయిన పరువును నిలబెట్టుకుంది.
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా 372 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇదే భారీ విజయం కావడం గమనార్హం. గతంలో విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉన్న కాలంలో విజయాలు పలకరించలేదు. ప్రస్తుతం కెప్టెన్సీ మార్చడంతో టీమిండియా దారిలో పడినట్లు కనిపిస్తోంది. విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉన్న సమయంలో కప్ లు మాత్రం గెలవలేకపోయింది. దీంతో టీమిండియా విమర్శల పాలయింది.
టీమిండియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగించి మ్యాచ్ ను మలుపు తిప్పింది. అద్భుతమైన ప్రతిభ కనబరచిన ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టును ముప్పతిప్పలు పెట్టారు. ఆటగాళ్ల సమష్టి కృషి తో అన్ని రంగాల్లో రాణించి న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. బంతి బంతికి ఆటను తమ ఆధీనంలో ఉంచుకుంటూ టీమిండియా ఆటగాళ్లు ఫామ్ కొనసాగించినట్లు తెలుస్తోంది.
Also Read: కెప్టెన్సీగా కోహ్లీ భవితవ్యం తేలేది ఎప్పుడంటే?
అద్బుతమైన భాగస్వామ్యంతో పరుగుల వరద పారించారు. అదే సమయలో ప్రత్యర్థిని సైతం తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఆటగాళ్ల విజృంభణతో మొత్తం మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాప్ ఆర్డర్ ను దెబ్బ కొట్టి సునాయాసంగా విజయం సాధించారు. టీమిండియా ఆటగాళ్ల మొక్కవోని ప్రతిభతో ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లను కట్టడి చేశారు. పరిమితంగా పరుగులు ఇస్తూ తమ నైపుణ్యంతో వికెట్టు పడగొట్టి వారిలో భయం సృష్టించారు.
Also Read : రోహిత్.. కోహ్లి.. ఎవరిది బెస్ట్ కెప్టెన్సీ..? భారత కెప్టెన్ గా ఎవరు బెటర్..? సోషల్ మీడియాలో రచ్చ