Team India: టీమిండియా టీ20 కప్ కొడుతుందా? పడుతుందా? అనేది రేపు తేలబోతోంది. గత టీ20 ప్రపంచకప్ విన్నర్ ఆస్ట్రేలియాతో టీమిండియా 3 టీ20లు ఆడబోతోంది. ఇక అనంతరం దక్షిణాఫ్రికతోనూ 3 టీ20లు ఆడుతుంది. దీంతోనే టీమిండియా వచ్చే ప్రపంచకప్ ను కొడుతుందా? లేదా? అన్నది తేలుతుంది.
టీమిండియాకు ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి. అందులో బాగా ఇబ్బంది పెడుతోంది మిడిల్ఆర్డర్ సమస్య. ఇక్కడ పంత్/కార్తిక్ లలో కేవలం ఒకరిని మాత్రమే తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండర్ కోసం పంత్ ను తీసుకుంటుంటే అతడు ఆడలేక టీమిండియా ఓడిపోతోంది. దినేష్ కార్తిక్ ను ఎంపిక చేస్తే పంత్ లాంటి బ్యాటర్ ను కూర్చబెట్టడం సబబు కాదు అని అనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ బలంగా లేక ఓపెనర్లు భారీ ప్రారంభాలు ఇచ్చినా భారీ స్కోర్లుగా మలచలేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
ఇక రెండోది బౌలింగ్ సమస్య. ఆసియాకప్ లో టీమిండియా ఓడిపోయిందే బౌలింగ్ వల్ల. డెత్ ఓవర్లు (15-19)లలో బౌలింగ్ సరిగా చేయలేక ప్రత్యర్థులు గెలిచారు. 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ వల్లే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడాం. అందుకే ఇప్పుడు టీంలోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఇద్దరూ డెత్ ఓవర్ స్పెషలిస్టులు. వీరిద్దరి ఆట బాగా ఆడితే టీమిండియాకు ఎదురు ఉండదు. వీరు ఎలా ఆడుతారన్నది కీలకం.
ఇక టీమిండియా కూర్పు ప్రధాన సమస్యగా మారింది. ఆల్ రౌండర్ జడేజా ఉన్నప్పుడు హార్ధిక్, జడేజాలతో టీం దుర్భేద్యంగా ఉండేది. కానీ అతడు గాయపడడంతో ఇప్పుడు ఆలోటును భర్తీ చేసే నాథుడే లేకుండా పోయాడు. అదే సమస్యగా మారింది. జడేజా స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ ఎంత మేరకు రాణిస్తాడన్నది వేచిచూడాలి.
టీమిండియా కప్ కొట్టాలంటే ప్రధానంగా మిడిల్ ఆర్డర్, బౌలింగ్ దళం రాణించాలి. భారీ స్కోర్లు చేసి.. బౌలర్లు కట్టడి చేస్తేనే విజయం తథ్యం.
అందుకే ఇప్పుడు ఇండియాలో జరిగే టీ20 సిరీస్ లు భారత్ కు కీలకం.. ప్రపంచ టీ20 చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే ప్రపంచకప్ పై ఆశలు ఉంటాయి.టీం సెట్ అవుతుంది. ఒక వేళ ఓడిపోతే డేంజర్ బెల్స్ కింద లెక్క. ఏం జరుగుతున్నది వేచిచూడాలి.