https://oktelugu.com/

Ind vs Aus : ఆస్ట్రేలియాలో టీమిండియా సీక్రెట్ ఆపరేషన్.. యశస్వి నిర్వాకం సంచలనం: వీడియో వైరల్

న్యూజిలాండ్ జట్టుతో వైట్ వాష్ ఓటమి.. ఆస్ట్రేలియా - ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టులలో పరాజయం.. వరస షాక్ ల మధ్య టీమిండియా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం రెండు విడతలుగా కంగారు గడ్డపై అడుగు మోపింది.

Written By: NARESH, Updated On : November 12, 2024 10:10 pm

Ind vs aus

Follow us on

Ind vs Aus : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి టీమిండియా ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4-0 తేడాతో విజయం సాధించాలి. గత రెండు సీజన్లలో భారత్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఛాంపియన్ గా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగంలోకి దిగి బంతి, బ్యాట్ తో చెమటోడ్చుతున్నారు. ఈ జాబితాలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడికి ఇదే తొలి ఆస్ట్రేలియా సిరీస్. గత కొద్దిరోజులుగా తిరుగులేని ఫామ్ ప్రదర్శిస్తున్న అతడు.. ఆస్ట్రేలియా మైదానాలపై పరుగుల సునామి సృష్టించాలని భావిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా యశస్వి బలంగా బంతిని కొట్టడంతో అది స్టేడియం అవతల పడింది. ఆ సమయంలో వాహనాలు రాకపోవడం.. మనుషుల సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీందర్ జడేజా ఎక్కువగా బ్యాటింగ్ పైన ఫోకస్ చేశారు. వైవిధ్యమైన షాట్లు ఎంపిక చేసుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ పెర్త్ మైదానం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కు భారత కెప్టెన్ గా బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ భార్య నవంబర్ మూడో వారంలో ప్రసవించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అతడు తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్ ను యశస్వి జైస్వాల్, రాహుల్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. భారత జట్టు ఆస్ట్రేలియాలో చేస్తున్న ప్రాక్టీస్ ను అత్యంత రహస్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2017 నుంచి నిలబెట్టుకుంటూ వస్తున్నది. ఈసారి కూడా ఆస్ట్రేలియాను ఓడిస్తే మూడోసారి కూడా టెస్ట్ గద ను దక్కించుకునే యుద్ధంలో టీమిండియా ఉంటుంది. గత రెండుసార్లు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ గదను కోల్పోయింది. రెండవసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈసారి ఫైనల్స్ వెళ్లి తొలిసారి టెస్ట్ గదను దక్కించుకోవాలని భావిస్తోంది.. న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ 0-3 తేడాతో కోల్పోవడంతో టీమ్ ఇండియా పై ఒత్తిడి పెరిగిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి వెళ్లాలంటే ఆస్ట్రేలియా పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4-0 తేడాతో ఆస్ట్రేలియా పై గెలిస్తేనే టీమ్ ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాగా, టీమిండియా ఆటగాళ్లు చేస్తున్న ప్రాక్టీస్ అత్యంత రహస్యంగా కొనసాగుతోంది. ప్రాక్టీస్ చేస్తున్న ప్రాంతానికి అభిమానులను అనుమతించడం లేదు. భారత జట్టు సిబ్బందిని సైతం సెల్ ఫోన్లు తీసుకువెళ్లనివ్వడం లేదు.