T20 World Cup IND vs ZIM : టీమిండియా ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింట్లో విజయం సాధించిన భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిందే. గ్రూప్ 2లో ఆరు పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్న భారత్ కు ఈ విజయం అవసరమే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆటలో జింబాబ్వేను కట్టడి చేయాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇండియాకు చావో రేవో అనే కోణంలో నిలుస్తోంది. జింబాబ్వేను ఆదివారం ఓడించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇండియా ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ మాత్రం ఏ మాత్రం బాగా లేదు. ఎంతో పనికి వస్తాడని దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకుంటే పేలవమైన ప్రదర్శనతో నిరుత్సాహ పరుస్తున్నాడు. దీంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఓపెనర్లు కూడా ఫామ్ లోకి రావడం లేదు. ప్రతి ఆటలో కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ లపైనే భారం పడుతుంది. దీంతో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కసరత్తులు చేసి మంచి ఫామ్ కొనసాగించాలని ఆశిస్తున్నారు.
మెల్ బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో జింబాబ్వేను ఎలాగైన ఓడించాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకే జింబాబ్వేను ఓడించిన భారత్ ఈసారి కూడా విజయం దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ లో టాపర్ గా నిలిచినా ఈ విజయంపైనే మన భవితవ్యం ఆధారడి ఉంది. ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రేపు జరిగే మ్యాచ్ లో డీకేపై వేటు పడి అవకాశం ఉంది. అక్షర్ పటేల్ ను కూడా జట్టు నుంచి తప్పించే వీలుంది. అతడి స్థానంలో యజువేంద్ర చహల్ ను తుది జట్టులోకి తీసుకునే చాన్స్ కనిపిస్తోంది.
మన ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ పేలవమైన ప్రదర్శన చేస్తున్నారు. గత నాలుగు మ్యాచుల్లోనూ ఓపెనర్లు శుభారంభం చేయలేకపోతున్నారు. గత మ్యాచ్ లో రాహుల్ అర్థ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చినా రోహిత్ మాత్రం ఫామ్ అందుకోలేకపోతున్నాడు. నెదర్లాండ్స్ పై మినహా అన్ని మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో మన ఆటగాళ్లు ఏ మేరకు స్పందించి విజయం సాధిస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. జింబాబ్వేను ఓడించి సెమీస్ ఆశలు ఖాయం చేసుకోవాలని అందరు భావిస్తున్నారు.