Homeక్రీడలుక్రికెట్‌Team India coaches : టీమిండియా కోచ్ లు : అందరినీ కలుపుకొని వెళ్లే కోచ్...

Team India coaches : టీమిండియా కోచ్ లు : అందరినీ కలుపుకొని వెళ్లే కోచ్ లే హిట్.. మొండిగా వెళ్లే వాళ్లు ఫట్..

Team India coaches : కలిసి ఉంటే కలదు సుఖం.. ఐకమత్యమే తిరుగులేని ఆయుధం.. ఇవన్నీ వ్యక్తిగత జీవితానికే కాదు.. క్రికెట్ కు కూడా వర్తిస్తాయి. క్రికెట్ అనేది సమూహ క్రీడ. ఒకరి మీదనే జట్టు ఆధారపడి ఉండదు. అందరూ సమష్టిగా ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయి. అందువల్లే కదా మెల్ బోర్న్ టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తం విఫలమైనప్పటికీ.. లయన్, బోలాండ్ చివరి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.. వాస్తవానికి క్రికెట్ ఆస్ట్రేలియా కు పని చేసిన ఏ కెప్టెన్ కూడా పెద్దగా వెలుగులోకి రాడు.. ఎందుకంటే జట్టును బలంగా నిర్మించే సమయంలో.. కోచ్ అనేవాడు వ్యక్తిగత ప్రాధాన్యాన్ని కోరుకోడు. కానీ టీమిండియాలో ఎందుకు విరుద్ధంగా జరుగుతోంది.
టీమిండియా జాన్ రైట్, గ్యారీ కిర్ స్టెన్, రాహుల్ ద్రావిడ్, రవి శాస్త్రి హయాంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లను గెలుచుకుంది. వాస్తవానికి ఈ కోచ్ ల సారథ్యంలో టీమిండియా మెరుగైన ఆట తీరు ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాలలో సత్తా చాటింది. అందువల్లే టీమిండియా తిరుగులేని స్థాయిలో నిలిచింది. వన్డే, టెస్ట్, టి20 ఫార్మాట్లలో నెంబర్ వన్ గా అవతరించింది. ఒకానొక సందర్భంలో బలమైన ఆస్ట్రేలియాను కూడా మట్టికరిపించింది. టెస్ట్ క్రికెట్లో ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. వన్డేలలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. టి20 లలో ధ్రువతారగా వెలిగింది. కానీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంది. టి20 మినహాయిస్తే వన్డేలలో గత ఏడాది ఒకే ఒక్క టోర్నీ టీమ్ ఇండియా ఆడింది. అందులో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. టి20 విషయంలో వంక పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. రెండు టెస్ట్ సిరీస్ లు కోల్పోయింది.  ఈ ఓటమి ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను దాదాపుగా మూసేసుకుంది.
కోచ్ లు సెట్ కావడం లేదా..
టీమిండియాతో సరదాగా కలిసిపోయే కోచ్ లు సూపర్ హిట్ అయ్యారు. ఆటగాళ్లతో నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ.. జట్టు విజయాలు సాధించేలా ప్రోత్సహించిన వారు ఆటగాళ్లతో మమేకం అయినవారు విజయవంతమయ్యారు.. వారు విజయవంతమైన కోచ్ లుగా అవతరించారు. కానీ ఆట విషయంలో ముందుగా ఉండే వారు పూర్తిగా విఫలమయ్యారు. గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా పెద్దగా విజయాలు సాధించలేదు. పైగా దారుణమైన ఓటుములను మూట కట్టుకుంది. అందువల్లే జట్టుతో కలిసి పోయే ఆటగాళ్లు ఉంటేనే బాగుంటుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. అందువల్లే అవి మెరుగ్గా రాణిస్తున్నాయి.. ఇప్పుడు శ్రీలంక కూడా అది దారిలో పయనిస్తోంది. సనత్ జయ సూర్య ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించి.. వారికి విరివిగా అవకాశాలు ఇస్తున్నాడు. కానీ టీమిండియాలో అది లోపించింది.. అది ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో ఓటమి, ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఓటమితో గంభీర్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. మరి ఈ సమస్యకు బీసీసీఐ ఎలాంటి పరిష్కారం చూస్తుందో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు ఇప్పటికే గౌతమ్ గంభీర్ వర్సెస్ సీనియర్ ఆటగాళ్లు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇది ఎక్కడిదాకా దారితీస్తుందో తెలియదు. పైగా ఇటీవల రోహిత్ శర్మకు, గౌతమ్ గంభీర్ కు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే గౌతమ్ గంభీర్ తన వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని స్పోర్ట్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular