IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 47.4 ఓవర్ లలో 248 పరుగులకు ఆల్ అవుట్ అయింది..జోస్ బట్లర్ 52, బెతెల్ 51 పరుగులతో ఆకట్టుకున్నారు.. రవీంద్ర జడేజా మూడు, హర్షిత్ రాణా మూడు వికెట్లతో అదరగొట్టారు. షమీ, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. ఇంగ్లాండ్ జట్టు విధించిన 249 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి, 251 పరుగులు చేసి సులభమైన గెలుపును అందుకుంది. గిల్ 87, అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులతో అదరగొట్టారు. ఇలాంటి చెట్టు బౌలర్లలో మహమ్మద్ రెండు వికెట్లు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్చర్, బెతెల్ చెరో వికెట్ సాధించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో సాల్ట్ ను అద్భుతమైన బంతితో రనౌట్ చేసిన అయ్యర్.. బ్యాటింగ్లో అదరగొట్టాడు. 19 పరుగులకే జైస్వాల్, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయిన టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అయ్యర్, గిల్ తో కలిసి స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు.. దీనికి తోడు ఇంగ్లాండ్ జట్టు పేలవమైన ఫీల్డింగ్ భారత జట్టుకు వరం లాగా మారింది. ఈ గెలుపు ద్వారా టీం ఇండియా 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.. రెండవ వన్డే కటక్ వేదికగా ఆదివారం జరుగుతుంది.
రోహిత్ నిరాశపరిచాడు
స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ భారత జట్టుకు ఊహించినట్టుగా మెరుగైన ఆరంభం లభించలేదు. జైస్వాల్ 15, రోహిత్ రెండు పరుగులకే అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్చర్ బౌలింగ్లో యశస్వి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ కూడా అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారిస్తున్నాడు.. దీంతో 19 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన అయ్యర్, గిల్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.. దూకుడైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. అనంతరం అయ్యర్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కూడా సత్తా చాటడంతో భారత్ 14 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసింది. అయితే ఈ జోడిని బెతెల్ విడదీశాడు. ప్రమాదకరంగా మారిన అయ్యర్ ను ఎల్ బీ డబ్ల్యూ గా అవుట్ చేశాడు. దీంతో 94 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి ఎండ్ కార్డు పడింది. అయ్యర్ ఔట్ అయినప్పటికీ అక్షర్ పటేల్, గిల్ దూకుడుగా ఆడారు. అయ్యర్ 60 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర పటేల్ కూడా 46 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఈ దశలో అక్షర్ పటేల్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో నాలుగో వికెట్ కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.. ఇదే క్రమంలో గిల్ కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. హార్థిక్ పాండ్యా 9*, రవీంద్ర జడేజా 12* తదుపరి లాంచనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.