ICC Women’s T20 World Cup : చావో రేవో తేలాల్సిన మ్యాచ్ లో.. టీమిండియా మహిళల జట్టు రెచ్చిపోయింది.. రికార్డుల దుమ్ము దులిపింది..

టీ -20 వరల్డ్ కప్ సాధించాలని.. ఎన్నో ఆశలతో టీమిండియా మహిళల జట్టు యూఏఈ లో ప్రవేశించింది. కానీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ ఆశలు కష్టమయ్యాయి. మిగతా మ్యాచ్ లు మొత్తం గెలిస్తేనే సెమీస్ వెళ్లే అవకాశం ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 10:49 pm

IND vs SL,

Follow us on

ICC Women’s T20 World Cup :  ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై భారత్ గెలిచింది. అయితే లో స్కోర్ మ్యాచ్లో.. టార్గెట్ త్వరగా ఫినిష్ చేయకుండా భారత ప్లేయర్లు కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో ఊహించిన నెట్ రన్ రేట్ సాధ్యం కాలేదు. ఫలితంగా శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ వ్యత్యాసంతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బుధవారం జరుగుతున్న లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై భారత ప్లేయర్లు వీరోచితంగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని.. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(52*), స్మృతి మందాన (50), షఫాలి వర్మ (43) ధాటిగా ఆడటంతో భారత్ ఏకంగా 172 రన్స్ చేసింది. ఇదే క్రమంలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇంతకీ భారత ప్లేయర్లు టి20 వరల్డ్ కప్ లో బ్రేక్ చేసిన ఆ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే..

గయానా వేదికగా 2018లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల నష్టానికి 194 రన్స్ చేసింది. టి20 వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో భారత్ చేసిన హైయెస్ట్ స్కోర్ ఇదే.

దుబాయ్ వేదికగా 2024 t20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టుపై భారత్ 172/3 రన్స్ చేసింది.

2018 లో గయానా వేదికగా ఆస్ట్రేలియా జట్టుపై 167/8 రన్స్ చేసింది.

2016లో బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్ పై 163/5 రన్స్ చేసింది..

గిబెర్హా వేదికగా 2023లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 155/6 రన్స్ చేసింది.

ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లపై 12 ఫోర్లు మాత్రమే కొట్టగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా పద్దెనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత ప్లేయర్లు మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.

2018లో గయానా వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ల ముగ్గురు 40+ రన్స్ చేశారు.

2018లో గ్రాస్ హైలెట్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ప్లేయర్లు ముగ్గురు 40+ పైగా పరుగులు చేశారు.

దుబాయ్ వేదికగా 2024లో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత ప్లేయర్లు ముగ్గురు 40+ పైగా రన్స్ చేసి రికార్డు సృష్టించారు.. ముగ్గురు ప్లేయర్లు 40 కి పైగా పరుగులు చేయడం టీమిండియా టి20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

హర్మన్ ప్రీత్ కౌర్ సంచలనం

ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 27 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు స్మృతి మందాన పేరు మీద ఉండేది.

ఆస్ట్రేలియాతో గయానా వేదికగా 2018లో జరిగిన మ్యాచ్లో స్మృతి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది.

2023లో కెప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.

న్యూజిలాండ్ జట్టుతో గయానా వేదికగా 2018లో జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ 33 బంతుల్లో అర్ద శతకం చేయడం విశేషం.

2010లో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అయితే ఓవరాల్ గా హర్మన్ ప్రీత్ కౌర్ మూడు సార్లు తక్కువ బంతుల్లో అర్థ శతకాలు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. అంతేకాదు 2018 లో శ్రీలంక జట్టుపై జరిగిన ఓ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం