Team India: టి20 వరల్డ్ కప్(T20 World Cup) గెలిచిన తర్వాత టీమిండియా ఆనందానికి అవధులు లేవు. ఫైనల్ మ్యాచ్ జరిగిన ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురవడంతో టీమిండియా అక్కడే మూడు రోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత బిసిసిఐ(BCCI ) ప్రత్యేక విమానం పంపించడంతో.. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందులో వచ్చారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆటగాళ్లు నేరుగా ప్రధానమంత్రిని కలిశారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ముంబైలో విక్టరీ పరేడ్(victory parade) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ముంబై నగరానికి లక్షలమంది అభిమానులు వచ్చారు. అంతటి జన సందోహం లో కూడా అభిమానులు అంబులెన్స్ కు దారి ఇచ్చి.. తమ క్రమశిక్షణను నిరూపించుకున్నారు.
Also Read: ఎట్టకేలకు ప్రణయ్ కేసు తీర్పు పై తొలిసారి స్పందించిన అమృత..
ఇప్పుడు నిర్వహించడం లేదట
దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ(Champions trophy) గెలిచినప్పటికీ.. ఇప్పుడు విక్టరీ పరేడ్ నిర్వహించడం లేదు. ఇప్పటికే ఆటగాళ్లు దుబాయ్ నుంచి భారత్ వచ్చారు. మార్చి 22 నుంచి ఐపీఎల్(Indian premier league) జరగనుంది. ఐపీఎల్(IPL) కోసం సన్నాహక సమావేశాలు.. ఇతర కార్యక్రమాలలో ఆటగాళ్లు బిజీగా ఉన్నారు. అందువల్లే విక్టరీ పరేడ్ నిర్వహించడం లేదని తెలుస్తోంది. నాడు టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు బీసీసీఐ((BCCI) కూడా టీమ్ ఇండియాకు ప్రత్యేకంగా నజరానా ప్రకటించింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఇక ముంబైలోని వాంఖడే మైదానంలో టీమిండి ఆటగాళ్లకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. అయితే ఇప్పుడు అలాంటి వేడుకలు బీసీసీఐ నిర్వహించడం లేదు. తీరికలేని షెడ్యూల్ ఉండడంతో.. కొంతమంది ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక అన్ని ఫ్రాంచైజీలు మార్చి 18 నుంచి క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆటగాళ్లకు క్షణం కూడా తీరికలేదు. అందువల్లే విక్టరీ పరేడ్, ఆటగాళ్లకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అభిమానులు గమనించాలని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ పై విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 251 పరుగులు చేసింది. ఆ తర్వాత టీం ఇండియా ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దక్కించుకున్నాడు. కాగా, విక్టరీ పరేడ్ నిర్వహించకపోవడంతో బీసీసీఐ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “T-20 WC కు ఉన్న విలువ.. CT కి లేదా?” అంటూ మండిపడుతున్నారు.