Venkatesh Iyer: టీమిండియా జట్టు కూర్పుపై మేనేజ్ మెంట్ దృష్టి సారిస్తోంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో జట్టుకు కొత్త రూపు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను నియమించిన క్రమంలో జట్టు ఎంపికలో ప్రాధాన్యతను కనబరుస్తున్నారు. మేలైన ఆటగాళ్ల కోసం ఆరా తీస్తున్నారు. బాగా ఆడే వారికి స్థానం కల్పించేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మను కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ, జడేజాలకు విరామం ఇచ్చింది. కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఐపీఎల్ లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్ ను ఆల్ రౌండర్ గా తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన పరాభవంలో ఆల్ రౌండర్ లేని లోటు ప్రధానంగా కనిపించింది. అందుకే జట్టు కూర్పులో ఆల్ రౌండర్ కోసం అన్వేషణ సాగిస్తోంది.
ఇటీవల కాలంలో హర్దిక్ పాండ్యా విఫలం కావడంతో అతడిపై సహజంగానే వేడు పడింది. దీంతో అతడి స్థానంల వెంకటేశ్ అయ్యర్ ను తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి తోడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో జట్టు కూర్పుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఓపెనర్ గా వచ్చే వెంకటేశ్ అయ్యర్ మిడిలార్డర్ లో ఆడించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Virat kohli: కోహ్లీ డౌన్ ఫాల్ స్టార్ట్.. టెస్టు కెప్టెన్సీ కూడా పీకేశారా?
మిడిలార్డర్ ఆడాలంటే కష్టమే. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు చేయాల్సి ఉంటుంది. దీంతో వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్ లేని లోటు తీరుస్తాడా అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి జట్టు కూర్పులో తనదైన మార్కు చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భారత జట్టు ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకుని విజయాలు సొంతం చేసుకోవాలని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతన్నాడు.