Pelli SandaD Movie: పెళ్లి సందD సక్సెస్ సెలబ్రేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి…

Pelli SandaD Movie: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. రాఘవేంద్ర రావు శిష్యురాలైన గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకేంద్రుడు కూడా న‌టుడిగా పరిచయమయ్యారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ల‌వ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 10, 2021 7:53 pm
Follow us on

Pelli SandaD Movie: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. రాఘవేంద్ర రావు శిష్యురాలైన గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకేంద్రుడు కూడా న‌టుడిగా పరిచయమయ్యారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంది.

తాజాగా ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ని చిత్ర యూనిట్ నిర్వహించింది. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లా జరిగిన ఈ వేడుకలకు దర్శకధీరుడు రాజ‌మౌళి స‌హా టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్ డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. ఈ కార్యక్రమంలో రాజ‌మౌళి చేతుల మీదుగా హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీలకు జ్ఞాపికల‌ను అంద‌జేశారు.

రాఘవేంద్రరావు సినిమాలంటేనే హీరోయిన్లు అత్యంత అందంగా ఉంటారు. వారి బొడ్డు చుట్టు పండ్లు, పూలు వేయిస్తూ పాటలన్నీ ఒక కన్నుల విందుగా చూపిస్తుంటాడు. అయితే ఇప్పుడు శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పెళ్లి సందD సినిమాలో నటించినందుకు శ్రీలీలకు మంచి పేరొచ్చింది అనే చెప్పాలి. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు… నటన, డాన్స్ లతో కూడా ఈ భామ అదరగొట్టింది. దీంతో రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అంటున్నారు. అంతేకాదు కుర్ర హీరోలు శ్రీలీల హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే ఈ శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం.