ODI World Cup 2023 : ఇవాళ్ల జరిగిన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ టీంలో ఉన్న ప్లేయర్లలో రచన్ రవీంద్ర, డారియల్ మిచెల్ ఇద్దరు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేసి ఆ టీం కి మంచి స్కోర్ అందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం బౌలర్లు కూడా తమదైన రీతిలో బౌలింగ్ చేసి న్యూజిలాండ్ ప్లేయర్లని ముప్పు తిప్పలు పెట్టి 300 పరుగులు చేయకుండా కట్టడి చేశారు.ఈ క్రమంలో ఈరోజు టీం లోకి వచ్చిన మహమ్మద్ షమీ తనదైన బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇస్తూ న్యూజిలాండ్ పైన 5 వికెట్లు తీసి బౌలింగ్ లో తనదైన సత్తా చాటుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం ఇన్ని రోజుల నుంచి మహమ్మద్ షమీ ని పక్కన పెట్టి చాలా పెద్ద తప్పు చేస్తుంది అనే విషయం అయితే మనకి మ్యాచ్ లో చాలా స్పష్టంగా తెలిసింది.
ఎందుకంటే షమీ తనదైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తూ తనదైన బౌలింగ్ తో విరుచుకుపడి ప్రతి బాల్ కి తనదైన వేరియేషన్ చూపిస్తూ న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లని ఇబ్బంది పెడుతూ కీలకమైన వికెట్లను తీసి న్యూజిలాండ్ నడ్డి విరిచాడనే చెప్పాలి. ఇలాంటి అత్యుత్తమమైన బౌలర్ ని ఇన్ని రోజుల నుంచి ఎందుకు బెంచ్ కే పరిమితం చేశారు అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశం గా మారింది.
ఇండియన్ టీమ్ లోనే అత్యుత్తమైన బౌలర్ అయిన షమీ అత్యుత్తమ బౌలింగ్ వేయడంలో దిట్ట అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే షమీ ఈరోజు ఇండియన్ టీం పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తూనే మన టీం లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తనకు వచ్చిన అవకాశాలను చాలా అద్భుతంగా వాడుకుంటూ తనదైన రీతిలో రెచ్చిపోతూ బౌలింగ్ చేశాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన వరల్డ్ కప్ లో మిగతా మ్యాచ్ లకి కూడా అవకాశాలను అందుకుంటూ తనదైన పర్ఫామెన్స్ ని చూపించడానికి రెడీగా ఉన్నాడు…ఇక ఈ క్రమం లో షమీ ఇక మీదట కూడా తన బౌలింగ్ లో వెరిషియన్ నీ అద్బుతం గా చూపించాడు ఇక రాబోయే మ్యాచ్ ల్లో ఆయన ఇండియన్ టీమ్ కి కీలక బౌలర్ గా మారనున్నాడు…