https://oktelugu.com/

Ponting Vs Gambhir: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీనే మొదలు కాలేదు.. ఆస్ట్రేలియా మాజీలు మైండ్ గేమ్ మొదలుపెట్టారు..

గత రెండు సీజన్లలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమ్ ఇండియా దక్కించుకుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకోవాలని భావిస్తోంది. త్వరలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో.. టీమిండియా కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యంత ముఖ్యంగా మారింది.

Written By:
  • Bhaskar
  • , Updated On : November 14, 2024 9:05 am

    Ponting Vs Gambhir(1)

    Follow us on

    Ponting Vs Gambhir: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టులు ఆడింది. టీమిండియా టెస్ట్ చరిత్రలో తొలిసారి వైట్ వాష్ కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇప్పటిదాకా ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న టీమ్ ఇండియా ఒక్కసారిగా రెండవ స్థానానికి పడిపోయింది. అంతేకాదు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాల్సి ఉంటుంది. అయితే ఈ సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా మొదలవుతుంది.

    మైండ్ గేమ్ మొదలుపెట్టారు

    తొలి టెస్ట్ మొదలుకాకముందే ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, సీనియర్లు టీమ్ ఇండియా ప్లేయర్లపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు.. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..”విరాట్ కొంతకాలంగా సరైన క్రికెట్ ఆడటం లేదు. అతడి నుంచి సెంచరీలు తగ్గిపోయాయి. గతంలో అతడు బీభత్సంగా బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు మాత్రం తేలిపోతున్నాడు. ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్లో అతడి గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని” పాంటింగ్ వ్యాఖ్యానించాడు. పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు..”విరాట్ ఎలా ఆడతాడో మాకు తెలుసు. అతని ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదు. అతడు తన లయను దొరకబుచ్చుకోవడం పెద్ద కష్టం కాదని” గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కెర్రి ఓ కీఫె కూడా విరాట్ పై విమర్శలు చేశాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ను అభినందిస్తూనే.. ఇటీవల కాలంలో విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. రోహిత్ శర్మను ఉద్దేశించి కూడా కైఫె సంచలన విమర్శలు చేశాడు. ” రోహిత్ మైదానంలోకి వస్తే ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోతారు. మిస్సైల్స్ లాగా బంతులు వేస్తారు. వాటిని తట్టుకోవడం రోహిత్ కు కాస్త కష్టమే. ఇక విరాట్ కూడా అత్యంత బలహీనంగా కనిపిస్తున్నాడు. అతడు కూడా ఆస్ట్రేలియా బౌలర్లకు టార్గెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని” కీఫె వ్యాఖ్యానించాడు.. ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు పాల్ ఆడమ్స్.. మహమ్మద్ షమీ ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం భారత జట్టుకు భారీ నష్టమని వ్యాఖ్యానించాడు. అతడు ఆడకపోవడం పెద్ద లోటు అని పేర్కొన్నాడు. “అతడు అద్భుతమైన బౌలర్. ఇటీవల కాలంలో శస్త్ర చికిత్స చేయించుకొని ఫిట్ గా ఉన్నాడు. కానీ అతడిని ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయలేదు. అతడు కనుక జట్టులో ఉండి ఉంటే భారత బౌలింగ్ దళం మరింత బలాన్ని సంతరించుకునేది. ఈ విషయాన్ని జట్టు మేనేజ్మెంట్ పట్టించుకోనట్టు కనిపిస్తోందని” ఆడమ్స్ వ్యాఖ్యానించాడు.