Ajinkya Rahane Test Cricket: డిఫెన్స్ అద్భుతంగా ఆడతాడు. అదే సమయంలో వేగంగా పరుగులు తీస్తాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తాడు. అలాగని ఆవేశపడి వికెట్ పారేసుకోడు. ఆస్ట్రేలియా పిచ్ లపై అదరగొడతాడు. స్వదేశీ పిచ్ లపై మెరుపులు మెరిపిస్తాడు. తనదైన రోజు మాత్రమే కాదు.. తనది కాని రోజు కూడా అతడు అదరగొడతాడు. అందుకే టీమిండియాలో మోస్ట్ అండర్ డాగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కంగారు జట్టుపై బీజీటీ సిరీస్ లో సత్తా చాటాడు. నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తున్న కంగారు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ చరితార్థకంగా నిలిచిపోయింది. నిలిచిపోతుంది..
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
బిజిటి సిరీస్ టీం ఇండియా గెలిచిన తర్వాత రహనే ఎక్కడికో వెళ్లిపోతాడు.. అతడి కెరియర్ అద్భుతంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. కొద్దిరోజులపాటు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. ఆ తర్వాత అతడు మెల్లిగా జట్టుకు దూరమయ్యాడు. కారణం తెలియదుగాని.. అతడు మాత్రం జట్టుకు చాలా దూరం జరిగి పోయాడు. ఈ క్రమంలోనే అతడు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. అందులో సత్తా చూపిస్తున్నప్పటికీ అతడికి జాతీయ జట్టులో స్థానం లభించడం లేదు. ఇటీవల ఐపీఎల్లో కోల్ కతా జట్టుకు అతడు నాయకత్వం వహించాడు. కానీ ఆ జట్టు ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపించలేకపోయింది. దీంతో రహనేకు మరోసారి జాతీయ జట్టులో అవకాశం లభించకుండా పోయింది.
జాతీయ జట్టులోకి రావాలని రహానే ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. అయితే తాను ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలనుకున్నట్టు రహానే చెబుతున్నాడు..” నేను క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. శిక్షకులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. త్వరలోనే దేశవాళి క్రికెట్ టోర్నీ మొదలవుతుంది.. దానికోసం నా సంసిద్ధతను మొదలుపెట్టానని” రహనే వ్యాఖ్యానించాడు. ” నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందులో ఆడటమంటే వివరితమైన ఇష్టం. అత్యంత సమయస్ఫూర్తితో డిఫెన్స్ ఆడుతూ.. చాప కింద నీరు లాగా పరుగులు తీయడం ఆసక్తికరంగా ఉంటుందని” రహానే వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం రహానే వయసు 35 సంవత్సరాలు. ఇప్పటివరకు అతడు 85 టెస్టులు ఆడాడు. ఇందులో 5,077 పరుగులు చేశాడు . మొత్తంగా అతడు 12 శతకాలు, 26 అర్ధ శతకాలు సాధించాడు.. ముఖ్యంగా బీజీటీ సిరీస్ లో అతని పేరు మీద అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన తర్వాత.. అతడు అదే లెగసి కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో జట్టుకు దూరంగా జరిగాడు.. ప్రస్తుతం జాతీయ జట్టులో ఆడాలనుకుంటున్నట్టు అతడు ప్రకటించాడు. అయితే ఇప్పటికైనా అతనిని జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. మరోవైపు గత ఏడాది జరిగిన బి జి టి సిరీస్ లో అతడికి అవకాశం కల్పించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే వాటిని గంభీర్ తోసిపుచ్చాడు.
AJINKYA RAHANE COMFIRMS HIS INTENTIONS TO RETURN FOR INDIA. ️
“I still want to play Test cricket for India”.pic.twitter.com/TlO8NdEdIP
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2025