India vs England : భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 577 మ్యాచ్‌ల క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించి టీమిండియా హిస్టరీలో రికార్డు నమోదు చేసింది. గతంలో ప్రత్యర్థి జట్లపై ఇన్నింగ్స్ విజయం సాధించినప్పటికీ ఈ విజయం మాత్రం చాలా ప్రత్యేకం. సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.
434 పరుగులతో గెలుపు..
రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో భారీగా స్కోర్ చేసిన టీమిండియా ఇంగ్లిష్ జట్టు ముందు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీ విరామానికి ముందు భారీ టార్గెట్‌లో బ్యాంటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ క్రికెటర్లు ఆ లక్ష్యాన్ని చూసే చేతులు ఎత్తేసినట్లు అనిపిస్తోంది. ఏ దశలోనూ పోరాట పటిమ కనబర్చలేదు. కేవలం 122 పరుగులకే కుప్పకూలిపోయింది. 434 పరుగల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. గతంలో న్యూజిలాండ్‌పై సాదించిన 372 పరుగ విజయమే ఇప్పటి వరకు రికార్డు. ఇప్పుడు 434 విక్టరీ సరికొత్త రికార్డు.
టీమిండియా అతిపెద్ద విజయాలు..
ఇక టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాలు చూస్తే..
– 434 ఇంగ్లండ్ పై (రాజ్‌కోట్ వేదికగా 2024లో..)
– 372 న్యూజిలాండ్‌పై(ముంబై 2021లో..)
– 337 సౌత్‌ఆఫ్రికాపై(ఢిల్లీ 2015లో..)
– 321 న్యూజిలాండ్‌పై(2016లో..)
– 320 ఆస్ట్రేలియాపై (మొహాలి 2008లో)
ఇక టీమిండియా ఇన్నింగ్ విజయాలు..
ఇక భారత క్రికెట్ జట్టు గతంలో సాధించిన ఇన్నింగ్స్ విజయాలు పరిశీలిస్తే..
– వెస్టిండీస్‌పై (272 పరుగులతో 2018లో, రాజ్‌కోట్)
– ఆఫ్ఘనిస్తాన్‌పై 262 పరుగులతో 2018లో, బెంగళూరు)
– బంగ్లాదేశ్‌పై(239 పరుగులతో 2007లో, మీర్‌పూర్)
– శ్రీలంకపై (239 పరుగులతో 2007లో, నాగపనూర్)
– శ్రీలంకపై (222 పరుగులతో 2022లో మొహాలీ)