MI Target 2026 IPL: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ముందు వరసలో ఉంటుంది. ఏకంగా ఐదుసార్లు ముంబై జట్టు విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు సంచలనమైన విజయాలను నమోదు చేసింది. ఒక రకంగా ఐపీఎల్ చరిత్రలో సరికొత్త ఘనతలను అందుకుంది. 2024లో ముంబై మేనేజ్మెంట్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. సాధారణ ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగిస్తోంది.
2024 సీజన్ నుంచి ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారధ్యంలో ముంబై జట్టు 2024 సీజన్లో అంత గొప్పగా విజయాలు అందుకోలేకపోయింది. 2025లో మాత్రం సూపర్ 8 దశ వరకు వెళ్లిపోయింది. అయితే అదే జోరును తొలి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో ముంబై జట్టు ప్రస్థానం అక్కడితోనే ఆగిపోయింది. అయితే 2026 సీజన్ లో మాత్రం అలా కాకుండా.. సరికొత్త చరిత్ర సృష్టించాలని ముంబై జట్టు యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలకు బీజం వేసింది. ఈ క్రమంలోనే జట్టులో అనేక మార్పులకు, చేర్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టనుంది.
2026 సీజన్ కు సంబంధించి మినీ వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ జట్టుకు సరికొత్త బలం కల్పించే విధంగా ప్రణాళికల రూపొందిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ పరంగా ముంబై జట్టుకు ఎటువంటి లోటు లేదు. స్పిన్ బౌలింగ్ లోనే ముంబై జట్టు కాస్త ఇబ్బంది పడుతోంది. తినే పద్యంలో క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై జట్టు యాజమాన్యం ఆలోచన చేస్తోంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి మయాంక్ మార్కండే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి రాహుల్ చాహర్ ను తీసుకోవాలని ప్లాంటు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ ముంబై జట్టు తరుపున ఆడారు. మయాంక్ 37 మ్యాచ్లలో 37 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ 78 మ్యాచ్లలో 75 వికెట్లు పడగొట్టాడు.
బ్యాటింగ్ పరంగా కూడా ముంబై జట్టు అత్యంత బలంగా ఉంది. టాప్ వన్ నుంచి 8 వికెట్ల వరకు అందరూ సూపర్ బ్యాటర్లు. పేస్ బౌలింగ్ పరంగా కూడా ముంబై జట్టుకు తిరుగులేదు. స్పిన్ పరంగా ముంబై జట్టు బలాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇక తిరుగు ఉండదు. అందువల్లే ముంబై జట్టును ఈసారి అత్యంత బలోపేతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అది గనక క్లిక్ అయితే 2026 సీజన్లో ముంబై జట్టు విజేతగా నిలుస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.