Homeక్రీడలుT20 World Cup IND vs PAK : ఫైనల్ లో ఇండియా, పాక్ తలపడనున్నాయా?

T20 World Cup IND vs PAK : ఫైనల్ లో ఇండియా, పాక్ తలపడనున్నాయా?

టీ20 వరల్డ్ కప్ లో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. సంచలనాలు నమోదవుతున్నాయి. సెమీస్ చేరుకోవాలంటే జట్ల మధ్య పోటీ తీవ్రమైంది. న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరుకోవడంతో గ్రూప్ 1, 2 లో ఏ జట్లు సెమీస్ కు చేరుకుంటాయో తెలియడం లేదు. సూపర్ 12 పోటీలకు నవంబర్ 6న తెరపడనుంది. రె ండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్ కు చేరుకోనున్నాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ కలలు నిజం చేసుకోగా శనివారం రోజు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లలో ఒకటి సెమీస్ కు చేరుకుంటాయి. ఆదివారం గ్రూప్ 2 నుంచి సెమీస్ కు చేరే జట్లు ఏవనే విషయం తేలిపోతుంది.

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. దాయాది దేశాల మధ్య పోరంటే భలే కిక్కు వస్తుంది. రెండు దేశాల అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఎగబడతారు. సూపర్ 12 దశలో పోటీ పడి భారత్ నెగ్గింది. ప్రస్తుతం ఇండియా, పాక్ సెమీస్ రేసులో ఉన్నాయి. భారత్ తన ఆఖరి పోరులో నెగ్గితే సెమీస్ చేరుతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆఖరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ నెగ్గినా ఇరు జట్లు సెమీస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.

గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్ కు చేరాలంటే పాయింట్లు ఆధారంగానే జరుగుతుంది. ఆరు పాయింట్లతో ఇండియా పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, పాకిస్తాన్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇండియా ఆఖరి మ్యాచ్ జింబాబ్వేతో గెలిచినా వర్షం కారణంతో రద్దయినా సెమీస్ కు చేరడం ఖాయం. పాకిస్తాన్ సెమీస్ చేరుకోవాలంటే మాత్రం దక్షిణాఫ్రికా  తన ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్ చేతిలో ఓడిపోవాలి.

బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ నెగ్గాలి. దీంతో భారత్ గ్రూప్ టాపర్ హోదాలో ఉంది. పాకిస్తాన్ ఆరు పాయింట్తతో గ్రూప్ రన్నరప్ గా సెమీఫైనల్ చేరుతుంది. సెమీఫైనల్ లో గ్రూప్ 1 జట్లతో జరిగే మ్యాచ్ ల్లో భారత్, పాక్ నెగ్గితే ఫైనల్ లో దాయాది దేశాలు పోటీ పడే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ పై అందరిలో ఎంతో ఉత్సాహం నెలకొంది. కానీ వాటి మధ్య మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియడం కష్టమే. దీంతో టీ20 వరల్డ్ కప్ లో ఏ దేశం ఏ దేశాన్ని ఓడిస్తుందో తెలియడం లేదు. ఏ అద్భుతాలు చోటుచేసుకుంటాయో కూడా అంతు చిక్కడం లేదు. ఇక సెమస్ లో చేరే దేశాలేవో ఆదివారం నాటి మ్యాచుల్లో బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version