T20 World Cup IND vs PAK Final?: 2022 టీ-20 వరల్డ్ కప్ ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందో చూస్తూనే ఉన్నాం..ఎవ్వరు ఊహించని విధమైన మలుపులతో ఈ టోర్నమెంట్ కొనసాగుతోంది.. సెమిస్ లో దాదాపుగా బెర్త్ ఖారారు అనుకున్న సౌత్ ఆఫ్రికా ఈరోజు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో దారుణంగా ఓడిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది..ర్యాంకింగ్స్ లో ఎక్కడో 17వ స్థానం లో ఉన్న నెదర్లాండ్స్ ని సౌత్ ఆఫ్రికా చాలా తేలికగా ఓడించేసింది..సెమిస్ లో సౌత్ ఆఫ్రికా స్థానం పదిలం అని అందరూ అనుకున్న వేళ దాన్ని ఇంటికి పంపించింది..

కానీ నెధర్లాండ్స్ బ్యాటింగ్ , బౌలింగ్ లో అద్భుతంగా రాణించి సౌత్ ఆఫ్రికా ని ఇంటికి పంపేసింది..సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం తో ఇండియా సెమిస్ కి నేరుగా వెళ్ళిపోయింది..ఇక బంగ్లాదేశ్ -పాకిస్థాన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ గెలవడంతో దాయాది జట్టు కూడా సెమిస్ కి వెళ్ళిపోయింది.. దీనితో ఫైనల్స్ మ్యాచ్ భారత్ – పాకిస్థాన్ మధ్య ఉండబోతుందా అంటే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.
ఈరోజు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా భారీ విజయం సాధించడంతో పాయింట్స్ టేబుల్ లో టాప్ 1 స్థానానికి చేరుకుంది..ఇప్పుడు మన భారత జట్టు సెమిస్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది.. అదే సమయం లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ తో తలపడబోతోంది.. ఈ రెండు మ్యాచులలో భారత్ – పాక్ లు గెలిస్తే ఫైనల్స్ లో మనం భారత్ – పాక్ లో మధ్య భీకరమైన పోరుని చూడొచ్చు..భారత్ – పాక్ ఇద్దరు కలిసి సెమిస్ లోకి వెళ్లడం 2007వ సంవత్సరం తర్వాత ఇప్పుడే జరిగింది..అప్పట్లో ఫైనల్స్ కి కూడా వెళ్లిన జట్లు ఈ రెండే..ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఉండబోతుందా లేదా అనేది చూడాలి.
2007వ సంవత్సరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 157 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ 5 పరుగుల తేడా తో పాకిస్థాన్ పై ఘాన విజయం సాధించింది..ఇప్పుడు మళ్ళీ అదే ఫీట్ ని రిపీట్ చేసి భారత్ ప్రపంచ కప్ కొడుతుందో లేదో చూడాలి.