https://oktelugu.com/

ICC t20 world cup: నేటి నుంచే టీ20 వరల్డ్ కప్: తొలి రోజు నాలుగు ప్రధాన మ్యాచ్ లు..గెలుపెవరిది?

ICC t20 world cup: కరోనా కల్లోలంతో ఏడాదిన్నరగా జనాలకు ఓ ఎంటర్ టైన్ మెంట్ లేదు.. పాడు లేదు. ఒకరి మొఖలు ఒకరు చూసుకుంటూ.. ఇంట్లోనే పడి చస్తూ.. ఓ టూర్లు లేకుండా.. ఓ సంబరాలు లేకుండా పడి ఉన్నారు. ఈ క్రమంలోనే కరోనా తగ్గడం.. ఆటలు మొదలు కావడం జరిగిపోయింది. దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత తాజాగా టీ20 ప్రపంచకప్ తో అసలు సమరం మొదలైంది. ఈ దశాబ్ధంలోనే అతిపెద్ద ఫైట్ భారత్, పాకిస్తాన్ […]

Written By: NARESH, Updated On : October 23, 2021 9:01 am
Follow us on

ICC t20 world cup: కరోనా కల్లోలంతో ఏడాదిన్నరగా జనాలకు ఓ ఎంటర్ టైన్ మెంట్ లేదు.. పాడు లేదు. ఒకరి మొఖలు ఒకరు చూసుకుంటూ.. ఇంట్లోనే పడి చస్తూ.. ఓ టూర్లు లేకుండా.. ఓ సంబరాలు లేకుండా పడి ఉన్నారు. ఈ క్రమంలోనే కరోనా తగ్గడం.. ఆటలు మొదలు కావడం జరిగిపోయింది.

ICC-T20-World-Cup-2021-Schedule

ICC-T20-World-Cup-2021-Schedule

దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత తాజాగా టీ20 ప్రపంచకప్ తో అసలు సమరం మొదలైంది. ఈ దశాబ్ధంలోనే అతిపెద్ద ఫైట్ భారత్, పాకిస్తాన్ క్రికెట్ టీ20 మ్యాచ్ రేపు రాత్రి జరుగబోతోంది. ఈరోజు టీ20 ప్రపంచకప్ ప్రారంభం రోజును దిగ్గజ నాలుగు జట్లు పోటీపడుతున్నాయి.

ఇప్పటికే క్వాలిఫయర్ మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లతో మొదలైన ఊపు ఇక పతాక స్థాయికి చేరనుంది. ధనాధన్ ఆటతీరుతో అభిమానులను అలరించేందుకు అగ్రశ్రేణి జట్లు సిద్ధమయ్యాయి. నేటి నుంచి సూపర్ 12 పోటీలకు తెరలేవనుంది. ఇక నుంచి జట్ల మధ్య పోరు అంతకు మించి ఉండబోతోంది.

శనివారం గ్రూప్1 లో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా పోరుతో టీ20 ప్రపంచకప్ సంరంభం ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో ఇంగ్లండ్ తలపడబోతోంది.

చివరి సారి 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో బ్రాత్ వైట్ విధ్వంసంతో టైటిల్ ను అందుకొని ఇంగ్లండ్ ను ఓడించి వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ను విండీస్ గెలిచింది. ఇప్పుడు మూడో టైటిల్ పై కన్నేసింది. విండీస్ టీంలో అందరూ మ్యాచ్ విన్నర్లే ఉండడం విశేషం. టీ20 లీగుల్లో పాల్గొంటూ వారందరూ భీకరంగా ఉన్నారు. ఇక ఇంగ్లండ్ ప్రపంచంలోనే నంబర్ 1 టీ20 జట్టుగా ఉంది.

ఇక మరో మ్యాచ్ లో దిగ్గజ ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. తాజా ఫామ్ లేమి ఆస్ట్రేలియాకు మైనస్ గా మారింది. దక్షిణాఫ్రికా యువ జట్టు. సీనియర్లు లేకపోవడం ఆజట్టుకు మైనస్. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే ఫేవరేట్. కానీ అనిశ్చితికి మారుపేరైన టీ20ల్లో ఏదైనా జరగొచ్చు. వార్నర్, ఫించ్ ఫామ్ లో లేకపోవడం ఆస్ట్రేలియాకు మైనస్ గా మారింది.

ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టీ20 ప్రపంచకప్ తొలి టీ20లో 3.30 గంటలకు జరుగనుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. రేపు పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఉండనుంది. దీంతో ఈ హీట్ పతాక స్తాయికి చేరనుంది.